AP 10th Results 2025 Released Today : లైవ్ లింక్, మార్క్స్ షీట్ ఎలా డౌన్లోడ్ చేయాలో చూడండి

AP 10th Results 2025 Highlights:

  1. ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి (AP SSC Results 2025) ఫలితాల్లో ఈరోజు ఉదయం 10 గంటలకు అధికారికంగా ఏపీ టెన్త్ బోర్డు వారు విడుదల చేయడం జరిగింది.
  2. ఫలితాలు చూసుకొనే వెబ్సైట్ యాక్టివ్ చేయడం జరిగింది.
  3. పదో తరగతి విద్యార్థులు వారి యొక్క హాల్ టికెట్ నెంబర్ తో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.
  4. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.

ఏపీ SSC ఫలితాల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి అభ్యర్థులకు శుభవార్త. ఈరోజు ఉదయం అనగా ఏప్రిల్ 23, 2025, 10 గంటలకు ఆంధ్రప్రదేశ్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు ఫలితాలను విడుదల చేయడం జరిగింది. మొత్తం 6 లక్షల పంతొమ్మిది వేల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. రెగ్యులర్ పదో తరగతి ఫలితాలతో పాటు ఈరోజు ఓపెన్ స్కూల్స్ టెన్త్, ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ఫలితాలు కూడా విడుదల చేస్తున్నారు. కావున విద్యార్థులందరూ వారి యొక్క హాల్ టికెట్ నెంబర్ తో వెంటనే ఆన్లైన్లో ఫలితాలు చెక్ చేసుకోగలరు.

ఫలితాలు ఎక్కడ చూసుకోవాలి?:

పదో తరగతి విద్యార్థులు వారి యొక్క ఫలితాలను ఈ క్రింది నాలుగు అధికారిక వెబ్సైట్స్ ద్వారా తెలుసుకోవచ్చు.

పైన తెలిపిన నాలుగు వెబ్సైట్స్ లింక్స్ ని ఓపెన్ చేసి ఏపీ పదవ తరగతి ఫలితాలు ఆప్షన్ పై క్లిక్ చేసి విద్యార్థులు హాల్ టికెట్ నెంబర్ ని ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు.

Join WhatsApp group

మార్క్ షీట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి :

విద్యార్థులు పదో తరగతి ఫలితాలు చూసిన తర్వాత, తమ యొక్క ప్రొవిజినల్ మార్క్ షీట్ ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఇంటర్మీడియట్ లో జాయిన్ అవ్వడానికి అడ్మిషన్ కోసం ప్రాథమికంగా ఉపయోగపడుతుంది.

  • ఫలితాలు స్క్రీన్ పైన చూసుకున్న తర్వాత “download Marksheet” అనే ఆప్షన్ కనిపిస్తుంది.
  • దానిపై క్లిక్ చేసి, PDF ఫార్మాట్లో సేవ్ చేసుకోవచ్చు.

ఫలితాలు చూసుకోవడానికి కావలసిన వివరాలు :

  1. పదో తరగతి విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్.
  2. వైఫై లేదా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్.
  3. మొబైల్ లేదా లాప్టాప్ కలిగి ఉండాలి.

పైన తెలిపిన వివరాలే కాకుండా మీరు వాట్సాప్ ద్వారా కూడా మీ యొక్క ఫలితాలను తెలుసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ వాట్స్అప్ గవర్నన్స్ నెంబర్ +91 95523 00009 ను సేవ్ చేసుకొని ఎడ్యుకేషన్ సర్వీసెస్ అయినటువంటి ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అక్కడ పదో తరగతి ఫలితాలకు సంబంధించిన లింక్ ఉంటుంది. ఆ లింకు పై క్లిక్ చేసి టెన్త్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అంతే మీ యొక్క ఫలితాలు స్క్రీన్ పైన చూపించడం జరుగుతుంది. వెంటనే మార్క్ షీట్ డౌన్లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవాలి.

ఫలితాలు చూసుకున్న తర్వాత మీ యొక్క ఫలితాలకు సంబంధించిన వివరాలను కామెంట్ రూపంలో తెలుపగలరు.