Telangana Inter Results:
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు కోసం ఎదురుచూస్తున్నటువంటి తెలంగాణ విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు వారు ఒక బ్రేకింగ్ న్యూస్ తెలపడం జరిగింది. రేపు ఉదయం డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు పట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. మొదటి రెండవ సంవత్సర ఇంటర్మీడియట్ ఫలితాలను తమ మొబైల్ లోనే చూసుకోవచ్చు. ఫలితాలు విడుదలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకొని అధికారిక వెబ్సైట్ లో మీ యొక్క ఫలితాలను చూసుకోగలరు.
విడుదల తేదీ మరియు సమయం:
తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సర పరీక్షలు మార్చి 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహించడం జరిగింది. మొత్తం 9.96 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి ఫలితాలను ఏప్రిల్ 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫలితాలను ఆర్థిక శాఖ మంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి విడుదల చేయడం జరుగుతుంది. కావున పరీక్షలు రాసినటువంటి అభ్యర్థులు మీ యొక్క ఫలితాలు చూసుకోవడానికి సిద్ధం కావాల్సి ఉంది.
తెలంగాణ నిరుద్యోగ యువతకు జపాన్ లో 500 ఉద్యోగాలు
రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి:
స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా అభ్యర్థులు వారికి సంబంధించినటువంటి ఫలితాలు చూసుకోవచ్చు.
మొదటగా అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://tgbie.cgg.gov.in/ ను ఓపెన్ చేయాలి
వెబ్సైట్లో మొదటి మరియు రెండో సంవత్సరం ఫలితాలకు సంబంధించిన ఆప్షన్స్ పై క్లిక్ చేయాలి.
మొదటి సంవత్సర ఫలితాలు పై క్లిక్ చేసి విద్యార్థులు వారికి సంబంధించిన హాల్ టికెట్ మరియు డేటాఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి
రెండో సంవత్సరం ఇంటర్ ఫలితాలు కోసం సెకండియర్ రిజల్ట్స్ ఆప్షన్ చేసి, వారి యొక్క క్రిడెన్షియల్స్ని ఎంటర్ చేయాలి.
వెంటనే స్క్రీన్ పైన విద్యార్థుల యొక్క ఫలితాలు చూపించడం జరుగుతుంది.
స్క్రీన్ పైన కనిపించిన రిజల్ట్స్ ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ చేసుకోవాలి.
ఈ విధంగా అధికారికి వెబ్సైట్లో విద్యార్థులు వారికి సంబంధించిన ఇంటర్ ఫలితాలను చూసుకోగలరు.
సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు:
తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ చూసుకున్న తర్వాత ఫెయిల్ అయినటువంటి అభ్యర్థులు లేదా మొదటి సంవత్సర ఇంటర్ విద్యార్థులు వారి యొక్క మార్క్స్ ని మెరుగుపరుచుకోవడానికి సంబంధించి సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. మే నెలలో నిర్వహించి, జూన్ నెలలో అని ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు తెలిపారు.
ఫలితాలు చూసుకోవడానికి ఈ క్రింది వెబ్సైట్ లింకుపై క్లిక్ చేయండి.
ఇంటర్మీడియట్ మరియు 10వ తరగతి ఫలితాలు వివరాల కోసం ప్రతిరోజు మా వెబ్సైట్ని visit చేయండి.
