AP SSC ఫలితాలు విడుదల తేదీ మరియు సమయం అధికారికంగా వచ్చిన సమాచారం

ఆంధ్రప్రదేశ్ లో ఎస్ఎస్సి లేదా పదో తరగతి ఫలితాలను (AP SSC Results 2025) ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు విద్యాశాఖ అధికారికంగా విడుదల చేయబోతున్నట్లు తాజా సమాచారం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాలు కోసం ఎదురుచూస్తున్నటువంటి అభ్యర్థులు వారి యొక్క హాల్ టికెట్ నెంబర్ లేదా ఇతర వివరాలు ఎంటర్ చేయడం ద్వారా వారి యొక్క ఫలితాలను చాలా తక్కువ సమయంలోనే చూసుకోవచ్చు. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లో 6,19,275 మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాయడం జరిగింది. ఇప్పటికి ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేసినటువంటి ఇంటర్మీడియట్ బోర్డు వారు ఈనెల 23వ తేదీన ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాలు కూడా విడుదల చేస్తున్నారు.

ఫలితాలు చూసుకోవడానికి ముఖ్యమైన వెబ్సైట్ :

  1. https://www.bse.ap.gov.in/
  2. http://www.schools9.com/
  3. https://www.manabadi.co.in/

ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి:

  • పైన తెలిపిన ఏదో ఒక వెబ్సైట్ లింక్ పై క్లిక్ చేసి ఆ వెబ్సైట్ని ఓపెన్ చేయాలి.
  • ” SSC results 2025 ” పై క్లిక్ చేయాలి.
  • మీ హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయాలి
  • అక్కడే ఉన్న సబ్మిట్ బటన్ పై క్లిక్ చేసి మీ ఫలితాలను చెక్ చేసుకోవాలి.
  • స్క్రీన్ పైన కనిపించినటువంటి ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవడం లేదా ప్రింట్ అవుట్ తీసుకోవడంలాంటివి చేయాలి.

పదో తరగతి ఫలితాలు విడుదలైనటువంటి సమయంలో మొత్తం ఆరు లక్షల మందికిపైగా ఉన్నటువంటి అభ్యర్థులు ఫలితాలను చూసుకోవడానికి అధికారికి వెబ్సైట్స్ అన్నీ ఓపెన్ చేయడం వల్ల సర్వర్ డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఆ సంబంధిత వెబ్సైట్స్ వెంటనే ఓపెన్ అయ్యే అవకాశం ఉండదు. కావున అభ్యర్థులు కొంత వేచి చూచి ఆ తర్వాత మీ యొక్క రిజల్ట్స్ ని చూసుకోగలరు.

ఫలితాలను డైరెక్ట్ గా లేదా నేరుగా చూసుకోవడానికి ఇక్కడే ఇచ్చినటువంటి లింక్ పై క్లిక్ చేయగలరు.

Results Direct Link

SSC results 2025

వాట్సాప్ లో ఎలా చూసుకోవాలి :

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా అభ్యర్థుల యొక్క రిజల్ట్స్ హాల్టికెట్స్ ఇవన్నీ కూడా వాట్సాప్ ద్వారానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో భాగంగానే పదవ తరగతి విద్యార్థులు వారి యొక్క రిజల్ట్స్ ని మీ యొక్క వాట్సాప్ లో డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు కనిపిస్తోంది.

వాట్సాప్ లో ఏ విధంగా మీ యొక్క ఫలితాలను చూసుకోవాలనేటువంటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ క్రింది విధానం ద్వారా తెలుసుకోగలరు.

  • ముందుగా విద్యార్థులు వాట్సాప్ గవర్నెన్స్ కి సంబంధించిన నంబర్ +919552300009 ను మీ మొబైల్ కాంటాక్ట్ లో సేవ్ చేసుకోవాలి.
  • తర్వాత ఆ నెంబర్ వాట్సప్ ఓపెన్ చేసి ఎడ్యుకేషన్ సర్వీసెస్ అనేటటువంటి ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి
  • అక్కడ పదో తరగతి ఫలితాలకు సంబంధించిన లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయాలి.
  • అభ్యర్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
  • వెంటనే ఫలితాలు మీకు డౌన్లోడ్ కావడం జరుగుతుంది.

ఈ విధంగా మీరు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మరియు వాట్సాప్ ద్వారా ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాల (AP SSC Results 2025) ను చూసుకోవచ్చు.