AP EAMCET 2025 Counselling Dates Released: How To Apply, Required Certificates List

AP EAMCET 2025 Counselling Dates:

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నా విద్యార్థులకు శుభవార్త. జూలై 17వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు ఎంసెట్ ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన మొదటి విడత కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా మొదట రెండు విడతల కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత మూడో విడత కౌన్సిలింగ్ కి సంబంధించి నిర్ణయం తీసుకోనుంది. మొదటి విడత కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత 2వ విడత కౌన్సిలింగ్ ఆగస్టు 10వ తేదీ నుండి నిర్వహించనున్నారు. ఎంసెట్ కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత ఫార్మసీ కౌన్సిలింగ్ ఉంటుంది. వ్యవసాయ కోర్సులకు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. అయితే ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ కి ఎలా అప్లై చేసుకోవాలి?, కావాల్సిన సర్టిఫికెట్స్ ఏమిటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.

AP EAMCET 2025 Counselling Schedule:

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ కౌన్సిలింగ్ 2025 షెడ్యూల్ ఈ క్రింది విధంగా నిర్వహించనున్నారు.

Join WhatsApp group

అంశము తేదీలు
మొదటి విడత కౌన్సిలింగ్ డేట్స్జూలై 17 నుండి ఆగష్టు 2, 2025 వరకు
రెండవ విడత కౌన్సెలింగ్ ప్రారంభ తేదీఆగష్టు 10 నుండి ప్రారంభం
మూడవ విడత కౌన్సిలింగ్ ఎప్పుడురెండవ విడత కౌన్సిలింగ్ తర్వాత తేదీలు ప్రకటిస్తారు
మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభ తేదీఆగష్టు 4, 2025

ఏపీ మొదటి విడత కౌన్సెలింగ్ లో ఇంజనీరింగ్ విభాగంలో సీట్లు పొందిన వారికి ఆగస్టు 4వ తేదీ నుండి మొదటి సంవత్సర ఫస్ట్ సెమిస్టర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. అందువల్ల మొదటి విడత కౌన్సిలింగ్ ని త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

AP జిల్లా కోర్టు 1620 ఉద్యోగాల పరీక్ష తేదీలు

కౌన్సిలింగ్ కొరకు కావలసిన సర్టిఫికెట్స్:

ఏపీ ఎంసెట్ 2025 ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ హాజరయ్యే విద్యార్థులు ఈ క్రింది ఒరిజినల్ మరియు జిరాక్స్ సర్టిఫికెట్లను కచ్చితంగా కలిగి ఉండాలి.

  1. ఏపీ ఎంసెట్ 2025 హాల్ టికెట్
  2. ఏపీ ఎంసెట్ 2025 ర్యాంక్ కార్డ్
  3. పదవ తరగతి మార్క్స్ మెమో
  4. ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో
  5. ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్
  6. కుల ధ్రువీకరణ పత్రాలు
  7. ఇన్కమ్ సర్టిఫికెట్
  8. pwd సదరం సర్టిఫికెట్
  9. పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం.

RRB NTPC 2025 గ్రాడ్యుయేట్ పరీక్షల ఆన్సర్ కీ విడుదల

కౌన్సిలింగ్ కు ఎలా Apply చెయ్యాలి?:

ఏపీ ఎంసెట్ 2025 ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కు ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా అప్లై చేసుకోవచ్చు.

  • ఎంసెట్ కౌన్సిలింగ్ కు దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా అధికారిక వెబ్సైట్ ని ఓపెన్ చేయండి
  • వెబ్సైట్ హోమ్ పేజ్ లో “AP EAMCET 2025 Counselling Application” ఆప్షన్ బె క్లిక్ చేయండి.
  • అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకుని, పూర్తి వివరాలు తప్పులు లేకుండా నమోదు చేసి సబ్మిట్ చేయండి
  • దరఖాస్తు పూర్తయిన తర్వాత, దగ్గరలోని ఎంసెట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సెంటర్ కి వెళ్లి సర్టిఫికెట్లను పరిశీలన చేయించుకోవాలి
  • తర్వాత విద్యార్థులు వెబ్ ఆప్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది.
  • సీట్ అలాట్మెంట్ చేసిన తర్వాత ఆగస్టు 4వ తేదీ నుండి తరగతులకు హాజరు కావాలి

AP EAMCET 2025 Counselling Website

పైన ఇచ్చిన లింకు ద్వారా ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ కు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోగలరు.