తెలంగాణ రైతు భరోసా పథకం 2025: డబ్బులు డిపాజిట్ కాని వారు, రేపటిలోగా ఈ వివరాలు సబ్మిట్ చేయండి – వెంటనే డబ్బులు డిపాజిట్ అవుతాయి

Telangana Rythu Bharosa Scheme 2025:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,రాష్ట్రంలో పంటలు పండించే రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి ” రైతు భరోసా పథకం”ప్రారంభించింది. ఈ పథకానికి సంబంధించి తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇటీవల ప్రభుత్వం విడుదల చేసింది. జూన్ 17వ తేదీ నుండి రైతుల ఖాతాలో డబ్బులు డిపాజిట్ అవుతున్నాయి.అయితే కొంతమంది రైతులకుడబ్బులు డిపాజిట్ కావట్లేదు. ఇలా డబ్బులు డిపాజిట్ కానీ రైతులకు మరొక అవకాశం ఇస్తూ జూన్ 20వ తేదీలోగా అవసరమైన వివరాలను సమర్పించిన రైతులకు డబ్బులు డిపాజిట్ చేయనున్నట్లు తెలిపింది.

ఎవరు అప్లై చేసుకోవాలి?:

Join WhatsApp group

  • జూన్ 5, 2025 తేదీలోపు పాస్ బుక్ లో పంట వివరాలు ఎంటర్ చేసిన రైతన్నలు
  • ఇప్పటికీ ఇంకా డబ్బులు డిపాజిట్ కానీ రైతులు
  • లబ్ధిదారుల ఆధార్ కార్డ్, బ్యాంకు ఖాతా వివరాలు, రిజిస్టర్ మొబైల్ నెంబర్ లో తేడా ఉన్నవారు. మళ్లీ అప్లై చేసుకోవాలి.

ఎవరికి ఎందుకు డబ్బులు డిపాజిట్ కాలేదు?:

లబ్ధిదారుడైన రైతుకు సంబంధించిన ఆధార్ కార్డ్, బ్యాంకు ఖాతా, పాస్ బుక్ లేదా సి డబ్ల్యూ సి జిరాక్స్ సమాచారం అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ దృష్టికి ఈ వివరాలు చేరకపోవడం వల్ల వారి యొక్క అకౌంట్స్ లో డబ్బులు డిపాజిట్ కాలేదు. కాబట్టి ఈ వివరాలను మళ్ళీ సమర్పించాల్సి ఉంటుంది.

TGSRTC లో 800 కండక్టర్ పోస్టులకు నోటిఫికేషన్

అప్లై చేయడానికి ఆకరు తేదీ?:

లబ్ధిదారుడై ఉండి డబ్బులు డిపాజిట్ కానీ రైతులు ఎవరైతే ఉన్నారో, వారు మీ గ్రామంలోని అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్(AEO) ను కలిసి, జూన్ 20వ తేదీలోగా ఈ క్రింద తెలిపినటువంటి డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయండి.

  • రైతుకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం
  • రైతు యొక్క బ్యాంకు ఖాతా వివరాలు
  • ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ
  • ప్రస్తుతం పని చేస్తున్న మొబైల్ నెంబర్
  • ఇవన్నీ AEO అధికారికి సమర్పించాలి. లేదా
  • రైతు భరోసా వెబ్సైట్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు.

తెలంగాణ టెట్ పరీక్ష, ప్రాథమిక ఆన్సర్ కీ, ఫైనల్ రిజల్ట్స్ విడుదల తేదీ

అప్డేట్ చేయడానికి అధికారిక వెబ్సైట్ ఏమిటి?

రైతు భరోసా పథకానికి అర్హులైన రైతులు ఆన్లైన్ ద్వారా కూడా మీ వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. అప్డేట్ చేసుకునేందుకు అధికారిక వెబ్సైట్ ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://rythubharosa.telangana.gov.in

ఆన్లైన్లో ఎలా అప్డేట్ చేయాలి?:

రైతు భరోసా పథకానికి అర్హులైన వారు డబ్బులు డిపాజిట్ కానట్లయితే మీ యొక్క వివరాలను మీరు డైరెక్టుగా ఆన్లైన్లోనే అప్డేట్ చేసుకోవచ్చు. దానికోసం ఈ క్రింది స్టెప్ వేస్తే ప్రాసెస్ ఫాలో అవ్వండి

  • ముందుగా రైతు భరోసా వెబ్సైట్ https://rythubharosa.telangana.gov.in ఓపెన్ చేయండి
  • పాస్ బుక్ డేటా ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి
  • అన్ని వివరాలను పూర్తి చేసి, పాస్ బుక్, ఆధార్ కార్డ్, బ్యాంకు ఖాతా వివరాలను జిరాక్స్ కాపీలతో పాటు సమర్పించండి.
  • గ్రామంలోని AEO లేదా మున్సిపల్ ఆఫీస్ లో ఈ వివరాలు ఇవ్వవచ్చు.

మళ్లీ అప్లై చేసేందుకు ఆఖరి తేదీ:

జూన్ 20, 2025 తేదీలోపు వివరాలు సమర్పించని రైతులకు డబ్బులు డిపాజిట్ కాకపోవచ్చు. కావున వెంటనే మీ యొక్క పత్రాలను సిద్ధం చేసుకుని గడువులోగా సబ్మిట్ చేయండి. మీకు కూడా వెంటనే 12 వేల రూపాయలు డిపాజిట్ అవుతాయి.

మీకు తెలిసిన రైతన్నలకు ఈ ఆర్టికల్ వివరాలను షేర్ చేయండి. వారికి సమాచారం తెలుస్తుంది.రైతు భరోసా పథకానికి సంబంధించిన అప్డేటెడ్ సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించండి.

లబ్దిదారుల జాబితా:

రైతు భరోసా పథకానికి మీరు ఎంపికయ్యారా లేదా అనేది తెలుసుకోవడానికి లబ్ధిదారుల జాబితాను దగ్గరలోని గ్రామపంచాయతీ ఆఫీస్ లో గాని, AEO నీ సంప్రదించి గాని తెలుసుకోండి. అర్హతలు ఉన్న అందులో పేరు లేని వారు జూన్ 20వ తేదీలోగా పైన తెలిపిన సర్టిఫికెట్స్ ని సబ్మిట్ చేయండి.