TS EAMCET 2025 Counselling Dates:
తెలంగాణ విద్యార్థులు ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త.తెలంగాణ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ని జూన్ చివరి వారంలో విడుదల చేసి, జూలై మొదటి వారం లేదా రెండో వారంలో కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య వి. బాలకృష్ణారెడ్డి వెల్లడించారు. గత సంవత్సరంలో కంటే ఈసారి ముందుగానే కౌన్సిలింగ్ నిర్వహించి తరగతులు ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఎంసెట్ కౌన్సిలింగ్ పూర్తి షెడ్యూల్ కి సంబంధించిన సమాచారాన్ని ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.
కౌన్సిలింగ్ ముఖ్యాంశాలు:
- జూలై మొదటి వారం లేదా రెండో వారంలో కౌన్సిలింగ్ ప్రారంభం అవుతుంది.
- ఈసారి కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తిస్థాయి ఆన్లైన్ విధానంలోనే జరుగుతుంది.
- ప్రతి జిల్లాలో హెల్ప్ లైన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది.
- మొదటి విడత కౌన్సిలింగ్ లో షెడ్యూల్ మరియు ర్యాంక్ ఆధారంగా కాల్ చేస్తారు.
- విద్యార్థుల కోసం ప్రత్యేక కెరియర్ గైడెన్స్ సదస్సులు కూడా నిర్వహిస్తారు.
తెలంగాణ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ తేదీలు:
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల తేదీ
| కౌన్సిలింగ్ అంశము | తేదీలు |
| నోటిఫికేషన్ విడుదల | జూన్ చివరి వారంలో |
| ఆన్లైన్లో నమోదు ప్రారంభం | జూలై మొదటి వారం లేదా రెండవ వారం |
| సర్టిఫికెట్ల పరిశీలన | జూలై రెండవ వారం నుంచి |
| వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ | జూలై మధ్యలో |
| మొదటి విడత సీట్ల కేటాయింపు | జూలై చివరి వారంలో |
| క్లాసులో ప్రారంభ తేదీ | ఆగస్టు మొదటి వారంలో ప్రారంభం |
కౌన్సిలింగ్ కు కావలసిన సర్టిఫికెట్స్:
తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ మరియు అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభ తేదీ
- తెలంగాణ ఎంసెట్ 2025 ర్యాంక్ కార్డ్
- ఇంటర్ మార్క్స్ మెమో
- పదవ తరగతి మార్క్స్ నమో
- ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్
- స్టడీ సర్టిఫికెట్ ఆరో తరగతి నుండి 12వ తరగతి వరకు
- రెసిడెన్షియల్ సర్టిఫికెట్
- కుల ధ్రువీకరణ పత్రం
- ఇన్కమ్ సర్టిఫికెట్ ( అవసరమైతే )
- రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్
- ఆధార్ కార్డు
హెల్ప్ లైన్ సెంటర్లు మరియు వెరిఫికేషన్ వివరాలు:
ప్రతి జిల్లాలో ఒక హెల్ప్ లైన్ సెంటర్ ని ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులు తమ యొక్క సమీప కౌన్సిలింగ్ కేంద్రంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది.
ఈసారి తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఎంసెట్ కౌన్సిలింగ్ ను అత్యంత పారదర్శకంగా & సమర్థవంతంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కెరియర్ గైడెన్స్ కూడా ఇవ్వనున్నారు.
