AP EAMCET 2025: 10,000 లోపు ర్యాంక్ వచ్చిన వారికి ఈ టాప్ యూనివర్సిటీస్, కాలేజీలలో సీట్స్ వస్తాయి

AP EAMCET 2025:

ఏపీ ఎంసెట్ 2025 ఫలితాలు జూన్ 8వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఫలితాలలో 10 వేల లోపు ర్యాంకు తెచ్చుకున్నటువంటి వారికి ఏ కాలేజీలలో సీటు వస్తుందో తెలుసుకోవాలనే ఒక ఆత్రుత ఉంటుంది. మీ ర్యాంకు తగిన టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు మరియు యూనివర్సిటీలకి సంబంధించినటువంటి పూర్తి జాబితా ఈ క్రింది విధంగా ఉంటుంది. ఇది గత సంవత్సరాల్లో ర్యాంకుల ఆధారంగా స్టూడెంట్స్ పొందినటువంటి కాలేజీల వివరాలను ఆధారంగా చేసుకొని ఈ డేటా ని ప్రిపేర్ చేయడం జరిగింది.

1-5,000 మధ్య ర్యాంకు వచ్చిన విద్యార్థులకు ఏ కాలేజీలలో, యూనివర్సిటీల్లో సీటు వస్తుంది:

Join WhatsApp group

• AU రీజియన్ ( ఆంధ్ర యూనివర్సిటీ జోన్):

  • ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ,విశాఖపట్నం
  • GMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రాజాం
  • గాయత్రీ విద్యా పరిషత్ (GVP), విశాఖపట్నం
  • విజ్ఞాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ

• SVU రీజియన్ ( శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ జోన్):

  • శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, తిరుపతి
  • శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్, తిరుపతి
  • అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రాజంపేట
  • మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్

ఏపీ ఎంసెట్ లో 5,000 నుండి 1,50,000 మధ్య ర్యాంక్ వచ్చినటువంటి వారికి ఏ కాలేజీల్లో సీటు వస్తుంది

• top deemed universities through convener quota:

  • KL యూనివర్సిటీ ( కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ) (Limited Branches)
  • విజ్ఞాన్స్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ (With Scholarship)

5,001 – 10,000 ర్యాంకు వచ్చిన విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్న కాలేజీల వివరాలు:

  • VIT – విజ్ఞాన్ భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విశాఖపట్నం
  • రాజీవ్ గాంధీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, నంద్యాల
  • SVEC – శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్, తిరుపతి
  • NBKR ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, విద్యానగర్
  • PACE ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, ఒంగోలు
  • RVR & JC కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ,గుంటూరు
  • ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్, కాకినాడ
  • VSM కాలేజీ.

ఏపీ ఎంసెట్ 2025 ర్యాంకులను మళ్లీ విడుదల చేయనున్నారు : RE-Ranking

1-10,000 ర్యాంకు వచ్చిన వారికి ఎలాంటి బ్రాంచులు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి?:

  • CSE, ECE వంటి హైట్ డిమాండ్ బ్రాంచులు, మొదటి 3000 నుండి 5000 మధ్య ర్యాంకు వచ్చినటువంటి వారికే ఈ బ్రాంచ్ లు అందుబాటులో ఉంటాయి.
  • CIVIL, MECH, EEE వంటి బ్రాంచ్ లు పదివేల వరకు ర్యాంకులు ఉన్నా కూడా దొరకవచ్చు.
  • కొత్తగా వచ్చిన కోర్సులు AIML, Data Science, cyber security వంటి బ్రాంచ్ల్లో కూడా వారికి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.

మీరు చేయవలసిన పని ఏమిటి?:

  1. APSCHE కౌన్సిలింగ్ ప్రారంభమయిన తర్వాత – మొదటి రౌండ్ వెబ్ ఆప్షన్స్ జరుగుతున్న సమయంలో, మీరు పైన పేర్కొన్న కోర్సులు మరియు కాలేజీలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి.
  2. Mock Counselling Tools ఉపయోగించి మీకు వచ్చిన ర్యాంక్ కు తగిన కాలేజీలను ఎంపిక చేసుకోండి.
  3. ప్రీవియస్ ఇయర్స్ లో ఉన్నటువంటి కటాఫ్ లను పరిశీలించండి. చాలా కాలేజీలను వాటి యొక్క హిస్టరీ ఆధారంగా మంచి అంచనా వేయవచ్చు.