AP 10th or SSC re-conting, a re-verification results declared:
ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి రెగ్యులర్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు విడుదలైన తర్వాత రీకౌంటింగ్ మరియు రివెరిఫికేషన్ పెట్టుకున్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి ఫలితాల్ని ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు ఈ రోజు విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రకటన జారీ చేశారు. మొత్తం 66,241 జవాబు పత్రాలు రీ వెరిఫికేషన్, 47,484 జవాబు పత్రాలకు సంబందించిన రీకౌంటింగ్ సంబందించిన ఫలితాలు విడుదల చేశారు. త్వరలోనే మిగిలిన ఫలితాలను విడుదల చేస్తాం అని బోర్డు వారు ప్రకటనలో తెలిపారు. అయితే ఈ ఫలితాల వివరాల కోసం విద్యార్థులు సంబందించిన స్కూల్ హెడ్ మాస్టర్స్ ని సంప్రదించాలని సూచించింది డిపార్ట్మెంట్. కావున 10వ తరగతి విద్యార్థులు మీ పాఠశాలలకు వెళ్లి, ఏపీ 10th బోర్డు అధికారిక వెబ్సైటు నుండి డౌన్లోడ్ చేసుకోగలరు.
రిజల్ట్స్ ఎలా చూసుకోవాలి?:
ఏపీ 10వ తరగతి రీకౌంటింగ్, రెవెరిఫికేషన్ ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.
- ముందుగా ఏపీ Ssc బోర్డు అధికారిక వెబ్సైటు (https://bse.ap.gov.in/sscrvrc/login) ఓపెన్ చేయండి
- SSC స్కూల్ కోడ్ & పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
- వెంటనే విద్యార్థుల రీకౌంటింగ్, రెవెరిఫికేషన్ వివరాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి.
- విద్యార్థులు హెడ్ మాస్టర్ సహాయంతో వాటిని డౌన్లోడ్ చేసుకోవాలి.
ఫలితాలు చూసుకున్న తర్వాత మీకు రేకౌంటింగ్, రెవెరికేషన్ ద్వారా మార్కులు కలిసాయా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయగలరు.
Official Website Link : Click Here
FAQ’s:
1.AP 10వ తరగతి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు ఎలా చూసుకోవాలి?.
విద్యార్థులు స్కూల్ హెడ్ మాస్టర్ ని సంప్రదించి ఫలితాలు Check చేసుకోవాలి.
2.మిగిలిన ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారు?
మిగిలిన రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఫలితాలను త్వరలో విడుదల చేస్తాం అని బోర్డు అధికారులు ప్రకటనలో తెలిపారు.
