TS Inter Results 2025:
తెలంగాణా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తెలంగాణా ఇంటర్ 1st ఇయర్ & 2nd ఇయర్ ఫలితాలను ఈ నెల 21వ తేదీన విడుదల చేసేందుకు భారీగానే కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఇంటర్ 1st & 2nd ఇయర్ పరీక్ష పేపర్స్ మూల్యాంకనం పూర్తి చేసిన అధికారులు, త్వరగా రిజల్ట్స్ విడుదల చేయడానికి సన్నద్దమయ్యారు. విద్యార్థుల ప్రశ్న పత్రాల వాల్యుయేషన్, డిజిటలైజషన్ వారంలో పూర్తి చేసి ఇక వెంటనే ఫలితాలు విడుదల చేస్తారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేశారు. తెలంగాణాలో కూడా విడుదల చేయబోతున్నారు.
ఫలితాలు విడుదల చేసే తేదీ:
తెలంగాణా ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సర ఫలితాలను ఏప్రిల్ 21వ తేదీన విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు దాదాపు 10 లక్షల మంది అభ్యర్థుల పరీక్ష పత్రాలను మూల్యకనం చేస్తూ నిమగ్నమయ్యారు. పేపర్స్ వాల్యుయేషన్ పూర్తి చేసి, మార్కుల డేటా ఎంట్రీ చేసి, గతంలో చేసిన తప్పులు చేయకుండా కరెక్ట్ గా ఫలితాలు విడుదల చేయాలని కసరత్తు చేస్తోంది ఇంటర్మీడియట్ బోర్డు.
TGSRTC లో 10th అర్హతతో జాబ్స్ : 3038 Jobs
సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు?:
తెలంగాణా ఇంటర్ ఫలితాలు విడుదల చేశాక, అందులో ఫెయిల్ అభ్యర్థులకు సప్లిమెంటరీ పరీక్షలను మే నెల చివరిలో నిర్వహించడం ద్వారా, ఫలితాలను జూన్ లో విడుదల చేయాలనీ ప్రభుత్వ అధికారులు సూత్ర ప్రయంగా నిర్ణయించడం జరిగింది.
విద్యుత్ శాఖలో 182 ఉద్యోగాలు : Apply
ఫలితాలు ఎలా చూసుకోవాలి?:
తెలంగాణా ఇంటర్మీడియట్ ఫలితాలను చూసుకోవడానికి ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూడాలి.
స్టెప్ 1: మొదటిగా ఇంటర్ రిజల్ట్స్ అధికారిక వెబ్సైటు https://tgbie.cgg.gov.in/ ఓపెన్ చెయ్యాలి
స్టెప్ 2: వెబ్సైటు హోమ్ పేజీలో 1st ఇయర్ & 2nd ఇయర్ రిజల్ట్స్ ఆప్షన్స్ ఉంటాయి.
స్టెప్ 3: మీ ఇయర్ రిజల్ట్స్ ఆప్షన్స్ పై క్లిక్ చెయ్యాలి.
స్టెప్ 4: విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఫలితాలు చూసుకోవాలి.
స్టెప్ 5: రిజల్ట్స్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి.
ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కోసం మా వెబ్సైటుని విజిట్ చేయండి.