AP Inter Results 2025:
ఆంధ్రప్రదేశ్ లోని ఇంటర్మీడియట్ 1st ఇయర్ & 2nd ఇయర్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం, ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఈరోజూ ఉదయం 11AM కి ఫలితాలను అధికారికంగా విడుదల చేయడం జరిగింది. మొదటి, రెండవ సంవత్సర ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన 10 లక్షల మంది విద్యార్థులు వాట్సాప్ లోగాని లేదా ఇంటర్నట్ లొంజ్ బోర్డు అధికారిక వెబ్సైటులలో ఫలితాలను చూసుకోవచ్చు. ఫలితాలను ఈ క్రింది సమాచారం ద్వారా తెలుసుకొని చూసుకోగలరు.
వాట్సాప్ లో ఫలితాలు ఎలా చూడాలి:
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలను మొబైల్ లోని వాట్సాప్ లో కూడా చూసుకునే విధంగా వినూత్నమైన అవకాశం కల్పిస్తున్నారు. వాట్సాప్ లో +91 95523 00009 నెంబర్ ని సేవ్ చేసుకొని హాయ్ అని మెసేజ్ చేసి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ని చూసుకోవచ్చు. వాట్సాప్ లోని ఎడ్యుకేషన్ సర్వీస్ పై క్లిక్ చేసి ఇంటర్మీడియట్ 1st, 2nd ఇయర్ ఫలితాల ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి రిజల్ట్స్ డౌన్లోడ్ చేసుకొని మార్క్స్ మెమో ని ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
AP జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో ఉద్యోగాలు : 10th అర్హత
ఇతర వెబ్సైటులలో ఎలా చూడాలి?:
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఈ క్రింది స్టెప్ బై సైప్ విధానం ద్వారా ఫలితాలు చూసుకోవచ్చు
స్టెప్ 1 : అధికారిక వెబ్సైటు https://resultsbie.ap.gov.in/ ఓపెన్ చెయ్యాలి.
స్టెప్ 2 : హోమ్ లోని ఇంటర్మీడియట్ 1st ఇయర్ & 2nd ఇయర్ రిజల్ట్స్ ఆప్షన్ పై క్లిక్ చెయ్యాలి
స్టెప్ 3: విద్యార్థులు వారి యొక్క ఇంటర్ విద్యాసంవత్సరాన్ని సెలెక్ట్ చేసుకోవాలి
స్టెప్ 4: స్టూడెంట్స్ వారియొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చెయ్యాలి.
స్టెప్ 5: వారి యొక్క రిజల్ట్స్ స్క్రీన్ పైన చూపించడం జరుగుతుంది.
స్టెప్ 6: ఆ ఫలితాలను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
పైన తెలిపిన విధంగా విద్యార్థులు వాట్సాప్ లో గాని, ఇతర వెబ్సైటులలో గాని ఫలితాలను చూసుకోవచ్చు. ఫలితాలు విడుదల చేసిన వెంటనే సర్వర్ పై ఒత్తిడి పడటంవల్ల ఫలితాలు చూపించడానికి కొంత సమయం పడుతుంది. కావున విద్యార్థులు కంగారు పడకుండా నిదానంగా రిజల్ట్స్ చూసుకోగలరు.
Official Results Website: https://resultsbie.ap.gov.in/