AP Inter Results 2025:
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఇంటర్మీడియట్ 1st & 2nd ఇయర్ ఫలితాలను విడుదల చేసేందుకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షల మూల్యాంకనం పూర్తి చేసిన బోర్డు అధికారులు 12న ఉదయం 11అం ఫలితాలు విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. గత సంవత్సరం 2024 లో ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 12న విడుదల చేశారు. ఈ సంవత్సర ఫలితాలను కూడా ఏప్రిల్ 12కి విడుదల చేసేందుకు రంగం సిద్ధమయ్యింది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాల పూర్తి సమాచారం చూడగలరు.
AP 1st & 2nd Year Results 2025:
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ 1st ఇయర్ & 2nd ఇయర్ ఫలితాలు ఒకేసారి విడుదల కాబోతున్నాయి. ఏప్రిల్ 12 తేదీన ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఫలితాలను అధికారికి ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు ఫలితాల వెబ్సైటులతో పాటు కొత్తగా వాట్సాప్ లో కూడా ఫలితాలు చూసుకునేందుకు అధికారులు సన్నాహాలు పూర్తి చేశారు. ఒక్క సెకండ్ లో అభ్యర్థుల రిజల్ట్స్ చూసుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది.
ఏపీలో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ : Apply
ఫలితాలు ఎలా చూడాలి:
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఫలితాలను ముందుగా వాట్సాప్ లో చూసుకోవచ్చు. వాట్సాప్ గవర్నన్స్ నెంబర్ కు హాయ్ అని మెసేజ్ పెట్టు ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఏపీ ఇంటర్ ఫలితాల ఆప్షన్ క్లిక్ చేసి 1st ఇయర్, 2nd ఇయర్ రిజల్ట్స్ ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి. అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ ఎంటర్ చెయ్యాలి. రిజల్ట్స్ విడుదల అవుతాయి, విద్యార్థులు వాటిని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
Step By step process:
ఇతర అధికారిక వెబ్సైట్స్ లో ఫలితాలు ఈ క్రింది విధంగా చూసుకోవాలి
స్టెప్ 1: ఏపీ ఇంటర్ రిజల్ట్స్ కోసం bie.ap.gov.in వెబ్సైటు ను సందర్శించాలి.
స్టెప్ 2: హోమ్ పేజీలో ఇంటర్ 1st ఇయర్ & 2nd ఇయర్ ఆప్షన్ పై క్లిక్ చెయ్యాలి
స్టెప్ 3: విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చెయ్యాలి
స్టెప్ 4: స్క్రీన్ పైన ఫలితాలు చూపిస్తుంది.
స్టెప్ 5 : విద్యార్థులు ఆ ఫలితాలను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
ఇంటర్మీడియట్ ఫలితాలు అప్డేట్, డౌన్లోడ్ కోసం మా వెబ్సైటుని ప్రతి రోజు విజిట్ చేయండి. మీకు అధికారిక సమాచారం అందించడం జరుగుతుంది.