AP 10th & Inter Results 2025:
ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల కోసం ప్రభుత్వం శుభవార్త తెలిపింది ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సర ఇంటర్మీడియట్ ఫలితాలను ముందుగా విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఇంటర్ ఫలితాలను ఈ నెల 12 నుండి 15వ తేదీ మధ్యన విడుదల చేయాలనీ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. 10వ తరగతి ఫలితాలను ఈ నెల చివరివారంలోనే విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నారు, ప్రస్తుతం పేపర్స్ కరెక్షన్ చేస్తున్నారు. ఫలితాలు ఎలా చూడాలి పూర్తి సమాచారం ఈ క్రింది లింక్స్ ద్వారా తెలుసుకోగలరు.
10వ తరగతి ఫలితాలు విడుదల తేదీ:
ఆంధ్రప్రదేశ్ సెకండరీ స్కూల్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు 10వ తరగతి ఫలితాలను ఈ నెల 30వ తేదీలోగా (4వ వారంలో) విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం బోర్డు అధికారులు పేపర్స్ కరెక్షన్ లో నిమగ్నమై ఉన్నారు.
ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల తేదీ:
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ 1st ఇయర్, 2nd ఇయర్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 12 నుండి 15వ తేదీలోగా విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే పేపర్స్ కరెక్షన్ పూర్తి చేసిన అధికారులు ఫలితాలను విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.
తెలంగాణా ఇంటర్ రిజల్ట్స్ డేట్ : Check
వాట్సాప్ లో ఫలితాలు:
ఆంధ్రప్రదేశ్ 10th, ఇంటర్మీడియట్ అభ్యర్థులు ఫలితాలు చూసుకోవడం కోసం కంగారు పడాల్సిన అవసరం లేకుండా మీ మొబైల్ లోని వాట్సాప్ లోనే రిజల్ట్స్ చూసుకునే అవకాశం కల్పిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
ముందుగా మీ వాట్సాప్ లో ఏపీ వాట్సాప్ గవర్నన్స్ నెంబర్ +91 95523 00009 ను మొబైల్ లో సేవ్ చేసుకోవాలి.
అందులోని సర్వీసెస్ లో ఇంటర్, 10th రిజల్ట్స్ పై క్లిక్ చెయ్యాలి.
విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చెయ్యాలి.
వెంటనే విద్యార్థుల రిజల్ట్స్ డౌన్లోడ్ అవుతాయి.
విద్యార్థులు మార్క్స్ మెమో డౌన్లోడ్ చేసుకోవాలి.
ఇతర వెబ్సైటులలో కూడా ఫలితాలు చూసుకోవచ్చు.
ఇంటర్మీడియట్ ఫలితాల కోసం ఈ క్రింది ఉన్న ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైటులోఫలితాలు చూసుకోవచ్చు.
10వ తరగతి పరీక్ష ఫలితాలను Ee క్రింది లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
వాట్సాప్ లో ఫలితాలు రానివారు పైన తెలిపిన లింక్స్ పై క్లిక్ చేసి చూసుకోవచ్చు.