Telangana Inter Results 2025:
తెలంగాణా ప్రభుత్వం మార్చ్ 20, 2025 తేదీ వరకు తెలంగాణా ఇంటర్మీడియట్ 1st ఇయర్ & 2nd ఇయర్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. పరీక్షలు రాసిన విద్యార్థుల యొక్క మొదటి, రెండవ సంవత్సర పరీక్ష పేపర్స్ ని తెలంగాణా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు మూల్యాంకనం చేస్తున్నారు. ఏప్రిల్ 10వ తేదీనాటికి పేపర్స్ కరెక్షన్ పూర్తి చేసి ఏప్రిల్ నాలుగవ వారంలో ఫలితాలు విడుదల చేయడానికి ప్రభుత్వ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అలాగే 35 మార్కులు రాకుండా ఫెయిల్ అయ్యే అవకాశం ఉన్న విద్యార్థులకు కూడా పెద్ద శుభవార్త తెలిపారు.
ఆ సబ్జెక్టులో అందరికీ 4 మార్కులు ఇస్తారు:
తెలంగాణా ఇంటర్మీడియట్ 2nd ఇయర్ ఇంగ్లీష్ సబ్జెక్టు పరీక్ష పేపర్ లోని 7వ ప్రశ్న అస్పష్టంగా ముదరించడంవల్ల విద్యార్థులు బాగా ఇబ్బంది పడిన కారణంగా ఆ ప్రశ్నకు సమాధానాలు రాసిన ప్రతి విద్యార్థికి 4 మార్కులు కేటాయించాలని తెలంగాణా ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీయుసుకోవడం జరిగింది.
పాస్ కానీ వారికి శుభవార్త:
తెలంగాణా ఇంటర్మీడియట్ పరీక్షల్లో 35 మార్కులు రానివారు నష్టపోకుండా వారి పేపర్స్ ని చీఫ్ ఎక్సమినర్, సబ్జెక్టు ఎక్స్పర్ట్స్ తో రాండమ్ కరెక్షన్ చేయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ నెల 15వ తేదీలోగా ఫలితాలు విడుదల చేయనున్న నేపథ్యంలో, తెలంగాణా ఫలితాలను కూడా త్వరగా మూల్యాంకనం చేసి విడుదల చేయాలనీ బోర్డు అధికారులు భావిస్తున్నారు.
AP ఇంటర్మీడియట్ రిజల్ట్స్ డేట్ : Check
ఫలితాలు విడుదల ఎప్పుడు?:
తెలంగాణా ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సర ఫలితాలను ఏప్రిల్ చివరి వారంలో విడుదల చేయనున్నారు. పేపర్స్ మూల్యాంకనం ఇప్పటికే చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఒకేసారి ఇంటర్ 1st ఇయర్ & 2nd ఇయర్ రిజల్ట్స్ విడుదల చేయనున్నారు.
ఏపీ 10th రిజల్ట్స్ విడుదల తేదీ : Check
How To Check Results:
విద్యార్థులు అధికారికి వెబ్సైటు tsbie.cgg.gov.in ని ఓపెన్ చెయ్యాలి.
వెబ్సైటులోని 1st ఇయర్, 2nd ఇయర్ రిజల్ట్స్ ఆప్షన్ పై క్లిక్ చెయ్యాలి.
విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్, DOB ఎంటర్ చెయ్యాలి.
స్క్రీన్ పైన వారియొక్క రిజల్ట్స్ చూపిస్తుంది.
రిజల్ట్స్ డాక్యుమెంట్స్ ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోవాలి.