AP Inter Results 2025:
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చ్ 1st న ప్రారంభమయ్యాయి, 2వ సంవత్సరం పరీక్షలు మార్చ్ 3వ తేదీన ప్రారంభమయ్యాయి. 1st ఇయర్ పరీక్షలను 19th మార్చ్ నాటికీ పూర్తి చేశారు, 2nd ఇయర్ పరీక్షలను మార్చ్ 20th నాటికీ పూర్తి చేశారు. పరీక్ష పత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభించిన బోర్డు అధికారులు ఫలితాలను ఈ నెల 12 నుండి 15వ తేదీలోగా విడుదల చేయాలనీ కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే పేపర్ కరెక్షన్ ను ఏప్రిల్ 6వ తేదీలోగా పూర్తి చెయ్యాలని చూస్తున్నట్లు తెలిపారు.
గతంలో ఎప్పుడు ఫలితాలు వచ్చాయి:
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబందించిన గత సంవత్సరాల హిస్టరీ చూస్తే, 2024 ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 12 న, 2023 ఫలితాలను ఏప్రిల్ 26న, 2022 ఫలితాలను జూన్ 22న అధికారులు విడుదల చేయడం జరిగింది. అయితే 2025 ఫలితాలను కూడా ఏప్రిల్ 12 నుండి 15వ తేదీలోగా విడుదల చేయాలనీ చూస్తున్నట్లు బోర్డు వర్గాల నుండి సమాచారం.
వాట్సాప్ లో నే రిజల్ట్స్:
విద్యార్థులు ఇంటర్ రిజల్ట్స్ చూసుకోవడానికి వేరే వెబ్సైట్లలోకి వెళ్ళాలసిన అవసరం లేకుండా సొంత మొబైల్ వాట్సాప్ లోనే రిజల్ట్స్ చూసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొబైల్ వాట్సాప్ గవర్నన్స్ నెంబర్ +91 95523 00009 ను సేవ్ చేసుకొని, హాయ్ అని మెసెజ్ చేసినట్లయితే వెంటనే 200 సేవలకు సంబందించిన Link వస్తుంది. అది క్లిక్ చేసి Ap ఇంటర్ రిజల్ట్స్ ఆప్షన్ పై క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి డౌన్లోడ్ రిజల్ట్స్ క్లిక్ చేస్తే విద్యార్థులు రిజల్ట్స్ డౌన్లోడ్ అవుతాయి.
మార్క్స్ మెమో కూడా వాట్సాప్ నుండే పొందవచ్చు. ఇలా సింపుల్ విధానంలో విద్యార్థులు పరీక్షల ఫలితాలను చూసుకునే అవకాశం కల్పిస్తున్నారు.
AP 10th రిజల్ట్స్ విడుదల చేసే డేట్ : Check
రిజల్ట్స్ అస్సలు ఎప్ప్పుడు వస్తాయి?:
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలను ఏప్రిల్ 12 నుండి 15వ తేదీలోగా విడుదల చేయడానికి అధికారులు, మంత్రి లోకేష్ సిద్ధమయ్యారు. అంటే కనిష్టంగా 6 రోజుల నుండి గరిష్టంగా 9 రోజుల్లో ఫలితాలు వచ్చేస్తాయి.
ఇతర అధికారిక వెబ్సైట్స్ లో కూడా ఫలితాలు చూడవచ్చు. వాట్సాప్ లో రిజల్ట్స్ చూసుకోవడం కుదరకపోతే విద్యార్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా రిజల్ట్స్ ని check చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ 10th, ఇంటర్మీడియట్ ఫలితాల కోసం మా వెబ్సైటుని సందర్శంచండి. వెంటనే ఫలితాలు చూసుకునే అవకాశం ఉంటుంది.