AP 10th Results 2025:
ఆంధ్రప్రదేశ్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు పెద్ద శుభవార్త విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల యొక్క ఫలితాలను విడుదల చేసే తేదీపై ఒక సమాచారం ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ 10th పరీక్షలను మార్చ్ 17th నుండి మార్చ్ 31st వరకు నిర్వహించడం జరిగింది. అయితే పరీక్ష పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 3rd నుండి ఏప్రిల్ 9th వరకు నిర్వహించడం జరుగుతుంది అని బోర్డు అధికారులు తెలిపారు. ఇప్పటికే పేపర్స్ కరెక్షన్ ప్రారంభించిన అధికారులు రోజుకి 45 పేపర్స్ ఒక టీచర్ కరెక్షన్ చెయ్యాలని నిబంధన పెట్టారు. దీనితో 9th ఏప్రిల్ 2025 నాటికీ కరెక్షన్ పూర్తి చేసి ఏప్రిల్ చివరి వారంలోనే ఫలితాలు విడుదల చేయాలనీ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
వాట్సాప్ లోనే 10th రిజల్ట్స్?:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నన్స్ ద్వారా ఇప్పటికే 200 వరకు సేవలను అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా విద్యార్థుల ఇంటర్, 10th పరీక్షల హాల్ టికెట్స్ కూడా వాట్సాప్ లోనే డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. అలాగే 10th, ఇంటర్మీడియట్ ఫలితాలు కూడా వాట్సాప్ లోనే చూసుకొని మార్క్స్ మెమో కూడా వాట్సాప్ ద్వారానే డౌన్లోడ్ చేసుకొనే విధంగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లు బోర్డ్ అధికారులు తెలిపారు. కావున ఇంటర్ ఫలితాలతోపాటు, 10th రిజల్ట్స్ కూడా వాట్సాప్ లోనే విద్యార్థులు చూసుకోవచ్చు.
10th ఫలితాలు విడుదల తేదీ:
ఆంధ్రప్రదేశ్ 10th ఫలితాలను ఏప్రిల్ 4వ వారంలోనే విడుదల చేయబోతున్నట్లు అధికారులు తెలిపారు. పేపర్స్ కరెక్షన్ ఏప్రిల్ 8వ తేదీకి పూర్తి చేస్తారని, తర్వాత నారా లోకేష్ విద్యా శాఖ మంత్రి చేతుల మీదుగా ఫలితాలు విడుదల చేయడం జరుగుతుంది అని బోర్డు అధికారులు తెలిపారు.
AP ఇంటర్ రిజల్ట్స్ విడుదల తేదీ : Check
వాట్సాప్ లో ఎలా చూడాలి?:
మొదటగా వాట్సాప్ గవర్నన్స్ నెంబర్ 9552300009 ని మొబైల్ లో సేవ్ చేసుకొని, ఆ నెంబర్ కి హాయ్ ని మెసేజ్ చెయ్యాలి.
వాట్సాప్ గవర్నన్స్ సేవల Link మీకు మెసేజ్ రూపంలో వస్తుంది.
అందులో ఏపీ 10th రిజల్ట్స్ ఆప్షన్స్ క్లిక్ చెయ్యాలి.
విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్లోడ్ రిజల్ట్స్ పై క్లిక్ చెయ్యాలి
వెంటనే రిజల్ట్స్ మీ వాట్సాప్ లోనే డౌన్లోడ్ అవుతాయి.
ఇతర వెబ్సైట్స్ ద్వారా కూడా ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.వాట్సాప్ లో ఫలితాలు చూడలేని పరిస్థితిలో అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా తమ 10th రిజల్ట్స్ ని డౌన్లోడ్ చేసుకొని మార్క్స్ మెమో కూడా పొందవచ్చు.
10th Results Official Websites: