TS Inter Results 2025:
తెలంగాణా ఇంటర్మీడియట్ బోర్డు మొదటి & రెండవ సంవత్సర ఫలితాలను త్వరగా విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. మొత్తం 10 లక్షల మంది ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన విద్యార్థులు ఉన్నారు. ఏప్రిల్ 10వ తేదీలోగా ప్రశ్న పత్రాల మూల్యాంకనం పూర్తి చేసి విద్యార్థుల మార్కులను ఏప్రిల్ 30వ తేదీలోగా ఫలితాలు విడుదల చేయాలనీ ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, 35 మార్కులు రానివారికి ఇంటర్మీడియట్ బోర్డు ఒక శుభవార్త కూడా తెలిపారు. పూర్తి సమాచారం ఈ క్రింది ఆర్టికల్ ద్వారా చదివి తెలుసుకోగలరు.
35 మార్కులు రానివారికి శుభవార్త:
తెలంగాణా ఇంటర్మీడియట్ బోర్డు ప్రశ్న పత్రాల మూల్యాంకనంలో ఒక మంచి నిర్ణయం తీసుకుంది. పరీక్షలో 35 మార్కులు రాని విద్యార్థులు నష్టపోకుండా వారియొక్క జవాబు పత్రాలను చీఫ్ ఎక్సమినర్, సబ్జెక్టు నిపుణులతో ర్యాండమ్ వాల్యుయేషన్ చేయిస్తున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. ఇది పాస్ కానీ అభ్యర్థులకు కొంత మేరకు చాలా మేలు కలిగించే విషయం.
ఇంటర్ రిజల్ట్స్ విడుదల తేదీ:
తెలంగాణా ఇంటర్మీడియట్ ఫలితాలను ఏప్రిల్ చివరి వారంలోగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా విడుదల చేసేందుకు అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఈ నెల 10వ తేదీలోగా పరీక్ష పేపర్స్ కరెక్షన్ పూర్తి చేసి రిజల్ట్స్ విడుదల చేస్తారు. ప్రస్తుతం మాథ్స్, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులను కరెక్షన్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
AP ఇంటర్ రిజల్ట్స్ విడుదల తేది FIX : Check Here
ఫలితాలు ఎలా చూసుకోవాలి:
ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సర పరీక్షలు రాసిన అభ్యర్థులు ఈ క్రింది స్టెప్ బై స్టెప్ విధానం ద్వారా వారి యొక్క ఫలితాలను చూసుకోవచ్చు.
మొదటగా అధికారిక వెబ్సైటు https://tgbie.cgg.gov.in/ ని ఓపెన్ చెయ్యాలి.
వెబ్సైటు హోమ్ పేజీలో తెలంగాణా ఇంటర్ 1st ఇయర్, 2nd ఇయర్ రిజల్ట్స్ ఆప్షన్ పై క్లిక్ చెయ్యాలి
విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ని పాస్వర్డ్ గా ఎంటర్ చేసి సబ్మిట్ చెయ్యాలి
స్క్రీన్ పైన సబ్జెక్టులవారీగా ఫలితాలు చూపించడం జరుగుతుంది.
ఫలితాల మార్క్స్ మెమో డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
ఇతర వెబ్సైటులలో కూడా ఇలాగే ఫలితాలు చూసుకోవచ్చు.
అడ్వాన్స్ సప్లీమెంటరీ పరీక్షలు ఎప్పుడు?:
ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సర ఫలితాలలో ఫెయిల్ అయిన అభ్యర్థులకు మే నెలలోనే రాత పరీక్షలు నిర్వహించడం ద్వారా సప్లీమెంటరీ పరీక్షలు పూర్తి చేసి జూన్ నెలలో ఫలితాలు విడుదల చేయాలనీ ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.
ఫలితాలు చూసుకునే Website : https://tgbie.cgg.gov.in/