AP Inter Results 2025:
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ 1st ఇయర్ & 2nd ఇయర్ ఫలితాలకోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఇంటర్మీడియట్ 1st & 2nd ఇయర్ ఫలితాలను ఏప్రిల్ 11, 12వ తేదీల్లో ఏదో ఒక రోజున రెండు సంవత్సరాల ఫలితాలు విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కసరత్తు చేస్తున్నారు.మరో నాలుగు లేదా అయిదు రోజుల్లో పేపర్స్ కరెక్షన్ (ప్రశ్న పత్రాల మూల్యాంకనం) పూర్తి చేసి రిజల్ట్స్ విడుదల చేయాలని చూస్తున్నారు. ఈసారి ఫలితాలను పలు అధికారిక వెబ్సైట్లతో పాటు, ఈసారి కొత్తగా వాట్సాప్ కి ఫలితాలను అనుసంధానం చేసి ఫలితాలు విడుదల చేయాలనీ ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా విద్యార్థులు వారు మొబైల్ లోని వాట్సాప్ లోనే ఫలితాలు చూసుకోవచ్చు.
వాట్సాప్ లో ఎలా ఫలితాలు చూసుకోవాలి:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల వాట్సాప్ గవర్నన్స్ ని తీసుకొని వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో 200 వరకు ప్రజా సేవలు అందిస్తుంది. అందరూ ప్రజలు ఆ సేవలను మొబైల్ లోని వాట్సాప్ ద్వారా పొందుతున్నారు. వాట్సాప్ లో ఇప్పుడు ఇంటర్మీడియట్,10th, ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షల ఫలితాలు విడుదల చేయాలని ప్రభుత్వం భావించి, మొదటి సారిగా ఇంటర్ రిజల్ట్స్ ని ఈ ఏప్రిల్ 11, 12 వ తేదీల్లో విడుదల చేస్తారు.
మీ మొబైల్ లో వాట్సాప్ గవర్నన్స్ నెంబర్ 9552300009 ను మీ మొబైల్ లో సేవ్ చేసుకుంటే అందులో వాట్సాప్ లో ఈ కాంటాక్ట్ చూపిస్తుంది. అది ఓపెన్ చేసి విద్యార్థులు రిజల్ట్స్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఫలితాలను చూసుకోవచ్చు.
ఇతర వెబ్సైటులలో ఫలితాలు ఎలా చూడాలి:
ముందుగా విద్యార్థులు వారియొక్క మొబైల్ ఫోన్ లోని ఇంటర్నెట్ బ్రౌజర్ లో bieap.gov.in లేదా resultsbie.ap.gov.in వెబ్సైటులో Check చేసుకోవచ్చు.
10th, ఇంటర్ రిజల్ట్స్ విడుదల తేదీ : Check
వెబ్సైటు ఓపెన్ చేసి అందులో ఏపీ ఇంటర్ రిజల్ట్స్ 1st ఇయర్ లేదా సెకండ్ ఇయర్ ఆప్షన్స్ పై క్లిక్ చెయ్యాలి.
తర్వాత విద్యార్థులు హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చెయ్యాలి.
అప్పుడు విద్యార్థుల ఇంటర్ ఫలితాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి.
మార్కులు, గ్రేడ్ పాయింట్స్ తో రిజల్ట్స్ చూపించడం జరుగుతుంది.
రిజల్ట్స్ డౌన్లోడ్ చేసుకొని, ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
ఫలితాలు విడుదల చేసే తేదీలు:
ఏప్రిల్ 11,12 ఏదో ఒక రోజు ఫలితాలు విడుదల చేయడానికి ప్రభుత్వం చాలా కసరత్తు చేస్తోంది. మరో 4 రోజుల్లో పేపర్ కరెక్షన్ పూర్తి చేసి ఫలితాలు కూడా విడుదల చేస్తారు.