Telangana Inter Results 2025:
తెలంగాణా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు 2025 సంవత్సరానికి గాను ఇంటర్ మొదటి మరియు 2వ సంవత్సరం పరీక్షలను ఎటువంటి అవంతరాలు, కాపీ లాంటి ఇష్యూ లేకుండా విజయవంతంగ మార్చ్ నెలలో ముగించడం జరిగింది. మార్చి 5వ తేదీ నుండి మార్చ్ 25 తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం తెలంగాణా రాష్ట్రంలో 9,96,971 మంది విద్యార్థులు పరీక్షలు రాయడం జరిగింది. కొంతమంది అభ్యర్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారు. అయితే ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకోసం ఒక ముఖ్యమైన సమాచారం రావడం జరిగింది. ప్రస్తుతం ప్రశ్న పత్రాల మూల్యాంకనం చేస్తున్న అధికారులు. ఫలితాలను ఏప్రిల్ 3వ వారం లేదా 4వ వారంలో విడుదల చేసే అవకాశం ఉంది.
ఇంగ్లీష్ సబ్జెక్టులో వారికి 4 మార్కులు :
తెలంగాణా ఇంటర్మీడియట్ బోర్డు వారు సెకండ్ ఇంటర్ పరీక్షలో ఇంగ్లీష్ పేపర్ రాసిన వారిలో క్వశ్చన్ నెంబర్ 07 అట్టెంప్ట్ చేసినవారికి అంటే ఆ ప్రశ్నకు సమాధానం రాసినవారికి 04 మార్కులు కేటాయించానుంది. ప్రశ్న పత్రాల ప్రింటింగ్ లో కొన్ని తప్పులు ఉండడంవల్ల బోర్డు వారు పరీక్ష పేపర్ విషయంలో నిబద్దత కలిగి ఉండాలి అని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ ప్రశ్నకు సమాధానం తప్పైనా, కరెక్ట్ అయిన అందరికీ ఫుల్ మార్క్స్ 04 మార్కులు ఇస్తారు.
ఫలితాలు విడుదల ఎప్పుడు?:
2024 లో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 24వ తేదీన విడుదల చేశారు. ప్రస్తుతం బోర్డు అధికారులు ప్రశ్న పత్రాల మూల్యాంకనంలో నిమగ్నమై ఉన్నారు. పేపర్స్ కరెక్షన్ పూర్తి చేసిన తర్వాత మార్కులను డేటా ఎంట్రీ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఫలితాలను విడుదల చేస్తారు. అయితే ఫలితాలను ఏప్రిల్ 3వ వారం లేదా 4వ వారంలో విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది అని బోర్డు అధికారులు మీడియాకి తెలిపారు.
సప్లీమెంటరీ పరీక్షలు ఎప్పుడు?:
తెలంగాణా ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేసిన తర్వాత అభ్యర్థులు ఫెయిల్ అయినా లేదా 1st ఇయర్ వారు మార్కులు పంచుకోవాలి అనుకున్నా అడ్వాన్స్ సప్లీమెంటరీ లేదా సప్లీమెంటరీ పరీక్షలు రాయాలి. ఈ పరీక్షలను మే 2025 లో నిర్వహించి, జూన్ 2025 లో ఫలితాలు విడుదల చేస్తారు.
AP ఇంటర్ రిజల్ట్స్ విడుదల తేదీ: Check
ఫలితాలు ఇలా చూసుకోవాలి.
మొదటగా తెలంగాణా ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైటుని సందర్శించండి.
హోమ్ పేజీలోని 1st & 2nd ఇయర్ ఇంటర్ రిజల్ట్స్ ఆప్షన్ పై క్లిక్ చెయ్యాలి
విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చెయ్యాలి.
ఫలితాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి.
మార్క్స్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోని ప్రింట్ అవుట్ తియ్యాలి.
Official Website Link: tsbie.cgg.gov.in