AP Inter Results 2025:
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ 1st ఇయర్, 2nd ఇయర్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు శుభవార్త. ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సర ఇంటర్మీడియట్ ఫలితాలను ఏప్రిల్ 3వ లేదా 4వ వారంలో విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ వారు తెలిపారు. ఏప్రిల్ 6వ తేదీలోగా పరీక్ష పత్రాల మూల్యాంకనం పూర్తి చేసి ఫలితాలను విడుదల చేసేందుకు కసరత్తు ప్రారంభించినట్లు ప్రభుత్వం నుండి సమాచారం. అభ్యర్థులు ఈసారి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలను మొబైల్ వాట్సాప్ లోనే చూసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
పేపర్ కరెక్షన్ ఎప్పటివరకు ఉంటుంది?:
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ 1st & 2nd ఇయర్ పరీక్షలను దాదాపుగా 10 లక్షల మంది విద్యార్థులు రాశారు. వారియొక్క పరీక్ష పత్రాలను మూల్యనకం ప్రారంభించిన ఇంటర్ బోర్డు అధికారులు, ఈ నెల 6వ తేదీలోగా పూర్తి చేయాలనీ చూస్తున్నారు. మూల్యాంకనం పూర్తి అయిన వెంటనే మార్కుల డేటా ఎంటర్ చేసి ఫలితాలను విడుదల చేస్తారు.
ఫలితాలు ఎలా చూసుకోవాలి:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసారి వినూత్నంగా ఇంటర్మీడియట్ ఫలితాలను విద్యార్థులు వారియొక్క మొబైల్ ఫోన్ లోని వాట్సాప్ లో చూసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఈ వాట్సాప్ గవర్నన్స్ లో 200 వరకు సేవలు అందిస్తున్నారు. ఇందులో భాగంగానే అన్ని పోటీ పరీక్షల ఫలితాలు వాట్సాప్ లో చూసుకోవచ్చు.
తెలంగాణా ఇంటర్ రిజల్ట్స్ విడుదల తేదీ : Check
ఫలితాలు చూసుకునే విధానం:
వాట్సాప్ లోనే కాకుండా విద్యార్థులు ఇతర అధికారిక వెబ్సైటులో ఇంటర్మీడియట్ ఫలితాలు చూసుకోవచ్చు.
మొదటగా అభ్యర్థులు గూగుల్ లో BIEAP వెబ్సైటు ఓపెన్ చేసి చూడాలి
Ap 1st ఇయర్ లేదా 2nd ఇయర్ రిజల్ట్స్ లింక్ పై క్లిక్ చెయ్యాలి.
అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్స్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చెయ్యాలి
స్క్రీన్ పైన కనిపించే ఫలితాలు చూసుకోవాలి.
పాస్ అయితే P అని ఫెయిల్ అయితే F అనే లెటర్స్ తో ఫలితాలు, మార్కులు చూసుకోవాలి
వచ్చిన రిజల్ట్స్ ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
ఈ విధంగా కూడా విద్యార్థులు రిజల్ట్స్ చూసుకోవచ్చు.
ఇంటర్మీడియట్ ఫలితాలు చూసుకునేందుకు అధికారిక వెబ్సైటు లింక్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.
మా Freejobsintelugu వెబ్సైటులో కూడా అభ్యర్థులు తమ యొక్క ఇంటర్మీడియట్ 1st ఇయర్ & 2nd ఇయర్ ఫలితాలు చూసుకోవచ్చు.