Telangana Inter Results 2025:
తెలంగాణాలో బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం ఫలితాలను ఏప్రిల్ 4వ వారంలో విడుదల చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇంటర్మీడియట్ 1st ఇయర్, 2nd ఇయర్ పరీక్షలను దాదాపుగా 10 లక్షల మంది అభ్యర్థులు రాసినట్లుగా ప్రభుత్వం తెలిపింది. ఇందులో భాగంగానే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ వారు పరీక్షల మూల్యాకనం ప్రారంభించి ఏప్రిల్ చివరినాటికి పూర్తి చేసి త్వరగా 4వ వారంలోనే ఫలితాలు విడుదల చేయాలనీ చూస్తున్నారు. ఇంటర్మీడియట్ ఫలితాలు పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ లో చూడగలరు.
ఎన్ని లక్షల మంది పరీక్ష రాశారు?:
తెలంగాణా ఇంటర్మీడియట్ 1st ఇయర్, 2nd ఇయర్ పరీక్షలను 2025 లో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణా ఇంటర్మీడియట్ బోర్డు ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు నిర్వహించడం జరిగింది. అన్ని జిల్లాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు దాదాపుగా 10 లక్షల మంది హాజరైనట్లు ప్రభుత్వం తెలిపింది.
సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు?:
తెలంగాణా ఇంటర్మీడియట్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు విడుదల చేసిన తర్వాత ఇంటర్ 1st ఇయర్, 2nd ఇయర్ లో కొన్ని సబ్జక్ట్స్ లో పాస్సవ్వని అభ్యర్థులకు 2025 జూన్ నెలలో సప్లీమెంటరీ లేదా మార్కులు పెంచుకునేందుకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.
గ్రంధాలయాల్లో గవర్నమెంట్ జాబ్స్ : 10th అర్హత
ఇంటర్ ఫలితాలు ఎలా చూసుకోవాలి:
అధికారిక వెబ్సైటుని సందర్శించండి : https://tsbienew.cgg.gov.in
హోమ్ పేజీలో TS ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి
ts ఇంటర్మీడియట్ 1st ఇయర్ లేదా 2nd ఇయర్ రిజల్ట్స్ జనరల్ / ఒకేషనల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
తెలంగాణా 12th రిజల్ట్స్ విండో ఓపెన్ అవుతుంది. ఆ లింక్ పై క్లిక్ చేయండి.
హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఫలితాలు డౌన్లోడ్ చేసుకోవాలి.
వచ్చిన ఫలితాలను డౌన్లోడ్ చేసుకోని ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
సర్వర్ డౌన్ ఇష్యూ:
తెలంగాణా ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేసినరోజున 10 లక్షల మంది అభ్యర్థులు ఒకేసారి అధికారిక వెబ్సైటుని ఓపెన్ చేయడవల్ల సర్వర్లపై ఒత్తిడి పెరిగి వెబ్సైటు ఓపెన్ కాదు. ఆ సమయంలో విద్యార్థులు ఫలితాలు చూసుకునే అవకాశం చాలా తక్కువ. కావున అభ్యర్థులు వేరే అధికారిక వెబ్సైటుని సందర్శించాలి.
ఆ వెబ్సైటుల లిస్ట్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.
www.eenadu.net
TS BIE Website
తెలంగాణా ఇంటర్ ఫలితాల విడుదల తేదీ గురించి వచ్చినా అధికారిక సమాచారం ఈ క్రింది లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.