Telangana District Magistrate Notification 2025:
తెలంగాణాలోని హనుమకొండ జిల్లా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ నుండి 13 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి మల్టీ జోన్ లో ఖాళీలకు రిక్రూట్మెంట్ చేస్తారు. MBBS, BAMS, స్టాఫ్ నర్స్, BSC నర్సింగ్ వంటి విభాగాల్లో అర్హతలు కలిగిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. MBBS, BAMS చేసిన వారికి ముందుగా ప్రిఫెరెన్సు ఇస్తారు. 18 నుండి 46 సంవత్సరాల వయస్సు ఉండాలి. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక ఉంటుంది. మెరిట్ మార్కులు, అర్హతలు చూసి ఉద్యోగాలు ఇస్తారు.
ముఖ్యమైన తేదీలు:
తెలంగాణా జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి విడుదలయిన ఉద్యోగాలకు అర్హతలు కలిగిన అభ్యర్థులు 26th మార్చి 2025 తేదీలోగా ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోగలరు.
ఎంత వయస్సు కలిగి ఉండాలి?:
18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు MLHP ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే రిజర్వేషన్ ఉన్న SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
పోస్టులు వివరాలు, అర్హతలు:
హనుమకొండ జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ కార్యాలయం నుండి కాంట్రాక్టు విధానంలో 13 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులను విడుదల చేశారు. అన్ని జిల్లాలవారు అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంది, ఎందుకంటే ఇవి మల్టీ జోనల్ పోస్టులు. MBBS, BAMS, స్టాఫ్ నర్స్, BSC/GNM నర్సింగ్ చేసిన అభ్యర్థులు అర్హులు. MBBS, BAMS చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
Ap జిల్లా కోర్టు జాబ్స్ నోటిఫికేషన్: Apply
అప్లికేషన్ ఫీజు:
ఏదైనా నేషనలైజడ్ బ్యాంక్ లో UR, OBC, EWS అభ్యర్థులు ₹500/- ఫీజు, మిగిలిన SC, ST, వికలాంగులు ₹250/- ఫీజు చెల్లించాలి. DM &HO హనుమకొండ పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ తియ్యాలి.
ఎంపిక చేసే విధానం:
మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. అర్హతలు, మెరిట్ మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జిల్లా DMHO ఆఫీస్ లో పోస్టింగ్ ఇస్తారు.
శాలరీ ఎంత ఉంటుంది?:
MLHP ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి నెలకు ₹30,000/- వరకు శాలరీ ఉంటుంది. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
కావాల్సిన సర్టిఫికెట్స్:
SSC / బర్త్ సర్టిఫికెట్,
ఇంటర్మీడియట్ 10+2 అర్హత సర్టిఫికెట్
అర్హత సర్టిఫికెట్, అన్ని సెమిస్టర్స్ మార్క్స్ మెమోస్
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ ఇన్ కౌన్సిల్
4th నుండి 10th వరకు స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
ఎలా Apply చెయ్యాలి:
ee క్రింది ఉన్న నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం PDFs డౌన్లోడ్ చేసుకొని గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి.