Telangana Grama Revenue Officer Jobs 2025:
తెలంగాణా ప్రభుత్వం గతంలో రద్దు చేసిన విలేజ్ రెవిన్యూ ఆఫీసర్, విలేజ్ రెవిన్యూ అసిస్టెంట్ పోస్టుల స్థానంలో 10,954 గ్రామ రెవిన్యూ అధికారుల పోస్టులను భర్తీ చేయడానికి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకొని ఆ పోస్టుల భర్తీ కొరకు ఆమోదం తెలుపడం జరిగింది. వీటిలో 6,000+ పోస్టులను గతంలో పని చేసిన VRO, VRA లతో భర్తీ చేస్తారు. మిగిలిన పోస్టులను కొత్తగా రిక్రూట్మెంట్ చేసి నియమించడం జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూడండి.
పోస్టుల అర్హతలు:
తెలంగాణా ప్రభుత్వం కొత్తగా చేపట్టబోయే గ్రామ రెవిన్యూ అధికారుల పోస్టులలో కొన్ని పోస్టులకు రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేస్తారు. ఆ ఉద్యోగాలకు నిరుద్యోగులు అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు గ్రామ రెవిన్యూ అధికారి పోస్టులకు Apply చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. SC, ST, ఓబీసీ, EWS అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలు: Apply
ఎంపిక చేసే విధానం:
తెలంగాణా గ్రామం రెవిన్యూ ఆఫీసర్ పోస్టుల భర్తీ విషయానికి వస్తే ఖాళీగా ఉన్న 10,954 పోస్టులలో 6,000+ పోస్టులను గ్రామం రెవెన్యూ ఆఫీసర్స్ (VRO, VRA) లతో భర్తీ చేస్తారు. మిగిలిన పోస్టులను నిరుద్యోగుల నుండి దరఖాస్తులు స్వీకరించి రాత పరీక్ష పెట్టి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా జాబ్స్ ఉద్యోగాలు ఇస్తారు.
అప్లికేషన్ ఫీజు :
గ్రామ రెవిన్యూ అధికారుల ఉద్యోగాల ఆఫీసియల్ నోటిఫికేషన్ వచ్చాక నోటిఫికేషన్ లో తెలిపిన ఫీజు అభ్యర్థులు చెల్లించాలి.
శాలరీ ఎంత ఉంటుంది :
గ్రామ రెవిన్యూ అధికారులు ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹30,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి. TA, DA, HRA అలవెన్సెస్ ఉంటాయి.
రైల్ వీల్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు : Apply
ఈ సర్టిఫికెట్స్ రెడీ చేసుకోండి:
పూర్తి చేసిన దరఖాస్తు, 10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
తెలంగాణా గ్రామం రెవెన్యూ అధికారుల ఉద్యోగాల తాజా సమాచారం కోసం ఈ క్రింది లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని పూర్తి సమాచారం చూడగలరు.
తెలంగాణాలోని అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు