Rail Wheel Factory Notification 2025:
రైల్వే మంత్రిత్వ శాఖకు సంబందించిన రైల్ వీల్ ఫ్యాక్టరీలో పని చేయడానికి 206 అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసి అర్హులైన మహిళలు, పురుష అభ్యర్థుల నుండి దరఖాస్తు కోరుతున్నారు. ఈ అప్రెంటీస్ ఖాళీలకు దేశంలోని 10వ తరగతి అర్హతతోపాటు ITI అర్హత కలిగి NCVT, SCVT సర్టిఫికెట్స్ కలిగిన అభ్యర్థులు అర్హులు. 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి. అప్రెంటీస్ ఖాళీల భర్తీ చేసే విధానం చూసి ఆఫ్ లైన్ లో అప్లికేషన్ గడువులోగా పంపించవలెను.
ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:
రైల్ వీల్ ఫ్యాక్టరీ పోస్టులకు అర్హులైనవారు ఈ క్రింది తెలుపబడిన తేదీలలోగా దరఖాస్తులు పంపించవలెను. దరఖాస్తులు చేరవలసిన అడ్రస్ : ప్రిన్సిపాల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్, పర్సనల్ డిపార్ట్మెంట్, రైల్ వీల్ ఫ్యాక్టరీ, ఎలాహంకా, బెంగుళూరు – 560064.
ఆఫ్ లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | 1st మార్చి 2025 |
ఆఫ్ లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ | 1st ఏప్రిల్ 2025 |
దరఖాస్తు రుసుము:
దరఖాస్తులు పంపించే అభ్యర్థులు పోస్టల్ ఆర్డర్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా ₹100/- ఫీజు చెల్లించి, ఆ రసీదును కూడా అప్లికేషన్ ఫారంతో కలిపి పంపించవలెను. SC, ST, PWD, మహిళ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
PGCIL విద్యుత్ శాఖలో ఫీల్డ్ సూపెర్వైసర్ ఉద్యోగాలు: Apply
వయో పరిమితి ఎంత ఉండాలి?:
అభ్యర్థులకు అప్రెంటీస్ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి కనిష్టంగా 15 సంవత్సరాల నుండి గరిష్టంగా 24 సంవత్సరాల మధ్య వయో పరిమితి కలిగి ఉండాలి. SC, ST, ఓబీసీ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నియమాల ప్రకారం వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
పోస్టులు వివరాలు, అర్హతలు:
రైల్వే డిపార్ట్మెంట్ లోని రైల్ వీల్ ఫ్యాక్టరీ నుండి అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయడానికి 206 పోస్టులను విడుదల చేశారు. ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణాకి సంబందించిన అభ్యర్థులు అందరూ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 10th, iti, ncvt, scvt సర్టిఫికెట్స్ కలిగినవారు అర్హులు.
1161 పోస్టులతో CISF డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ : 10th అర్హత
ఎంపిక చేసే విధానం:
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు పెట్టుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిసికల్ ఈవెంట్స్ లేకుండా, 10th, iti లో వచ్చిన మెరిట్ మార్కులు ఆధారంగా సెలక్షన్ చేసి పోస్టింగ్ ఇస్తారు. Pet, pmt ఈవెంట్స్ ఉండవు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.
స్టైపెండ్ ఎంత ఉంటుంది:
రైల్వే వీల్ ఫ్యాక్టరీలో అప్రెంటీస్ ఖాళీలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు పోస్టులను భట్టి ₹10,899/- నుండి ₹12,261/- చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్ ఉండవు.
AP మెడికల్ కాలేజీలో అవుట్ సోర్సింగ్ జాబ్స్ : Jr.అసిస్టెంట్స్
సర్టిఫికెట్స్ ఏమీ ఉండాలి:
10th, ITI, Ncvt, scvt సర్టిఫికెట్స్
కుల నిర్ధారణ సర్టిఫికెట్స్,
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
నోటిఫికేషన్ & అప్లికేషన్:
రైల్ వీల్ ఫ్యాక్టరీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని సబ్మిట్ చేయవలెను.