PGCIL Notification 2025 :
విద్యుత్ సరఫరాల సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి కాంట్రాక్టు పద్దతిలో వర్క్ చేయడానికి ఫీల్డ్ సూపెర్వైసోర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 55% మార్కులతో ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసి 18 నుండి 29 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోగలరు.
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | 5th మార్చి 2025 |
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ | 25th మార్చి 2025 |
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 29 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
10th అర్హతతో 1161 గవర్నమెంట్ జాబ్స్ విడుదల: Apply
పోస్టులు వివరాలు, అర్హతలు:
కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి కాంట్రాక్టు విధానంలో 28 ఫీల్డ్ సూపెర్వైసోర్ ఉద్యోగాలకోసం నోటిఫికేషన్ జారీ చేశారు. డిప్లొమాలో ఇంజనీరింగ్ పూర్తి చేసి 55% మార్కులు కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోగలరు.
అప్లికేషన్ ఫీజు:
Pgcil ఉద్యోగాలకు ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులు ₹300/- నాన్ రిఫండబుల్ ఫీజు చెల్లించాలి. అన్ని కేటగిరీలవారికి ఫీజు ఉంది.
AP అవుట్ సోర్సింగ్ జాబ్స్ నోటిఫికేషన్: Jr. అసిస్టెంట్స్
ఎంపిక చేసే విధానం:
అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి పోస్టింగ్ ఇస్తారు. రాత పరీక్షలో జనరల్ టాపిక్స్ తో పాటు, కోర్ సబ్జక్ట్స్ నుండి కూడా ప్రశ్నలు వస్తాయి. అప్టిట్యూడ్, రీసనింగ్, జీకే, ఇంగ్లీష్, ఇంజనీరింగ్ సబ్జక్ట్స్ ప్రిపేర్ కావాలి.
శాలరీ వివరాలు:
ఫీల్డ్ సూపెర్వైసర్ గా ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹23,000/- శాలరీతో పాటు TA, DA, HRA కూడా చెల్లిస్తారు.
AP వ్యవసాయశాఖలో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు: Apply
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
10th, డిప్లొమా అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.
ఎలా Apply చెయ్యాలి?:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి విడుదలయిన ఉద్యోగాలకు అర్హతలు కలిగినవారు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని Applu చేసుకోండి.
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోగలరు.