Welfare Dept. Notification 2025:
కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ICMR ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రం, శ్రీ విజయ పురం నుండి 06 పోస్టులతో అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంటర్, డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ నుండి విడుదలయిన డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభమయిన తర్వాత దరఖాస్తులు చేసుకోవాలి. అప్లికేషన్ డేట్స్ నోటిఫికేషన్ తెలుపలేదు.
పోస్టులు అర్హతల వివరాలు:
కేంద్ర ప్రభుత్వ కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖకు సంబందించిన ICMR ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రం, శ్రీ విజయ పురం నుండి డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేయడానికి అసిస్టెంట్, Ldc, Udc ఉద్యోగాలను విడుదల చేశారు. ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
AP సర్వేయర్ ఉద్యోగాలు: No Exam, No Fee
ఎంత వయస్సు ఉండాలి :
18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల మధ్య వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు ఎంత?:
ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులలో UR, OBC, EWS వారికి ₹2000/- ఫీజు, SC, ST, మహిళా అభ్యర్థులకు ₹1600/- ఫీజు చెల్లించాలి.
ఫుడ్ డిపార్ట్మెంట్ లో గవర్నమెంట్ జాబ్స్ : Apply
సెలక్షన్ చేసే విధానం:
ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు ఒక్కటే రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, పరీక్షలో మంచి మెరిట్ మార్కులు వచ్చిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి csir డిపార్ట్మెంట్ లో పోస్టింగ్ ఇస్తారు
శాలరీ ఎంత ఉంటుంది:
అసిస్టెంట్, LDC, UDC లుగా ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹50,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్
కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
TGSRTC లో 1500 ఉద్యోగాలు: 10th అర్హత
ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
నోటిఫికేషన్ లోని అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
కుటుంబ సంక్షేమ శాఖ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.