Telangana Anganwadi Jobs Notification 2025:
తెలంగాణా ప్రభుత్వం అధికారికంగా అన్ని జిల్లాలలో ఖాళీగా ఉన్న 14,236 అంగన్వాడీ ఉద్యోగాలను రెగ్యులర్ విధానంలో భర్తీ చేయడానికి పర్మిషన్ ఇస్తూ మంత్రి సీతక్క పోస్టుల ఫైల్ పై సంతకం చేసి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇందులో 6,399 అంగన్వాడీ టీచర్స్, 7836 అంగన్వాడీ హెల్పర్స్ ఉద్యోగాలు ఉన్నాయి. రాష్ట్రంలో Mlc ఎన్నికల కోడ్ ముగియగానే సంబందించిన జిల్లా కలెక్టర్స్ చేత భర్తీ చేయనున్నారు. ఈ అంగన్వాడీ ఉద్యోగాల అర్హతలు, వయస్సు, జీతం, సెలక్షన్ ప్రాసెస్ పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోగలరు.
ఎంత వయస్సు ఉండాలి?:
తెలంగాణా అంగన్వాడీ ఉద్యోగాలకు గ్రామాలలో స్థానికంగా ఉన్న మహిళా అభ్యర్థులు 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
పోస్టులు వివరాలు, అర్హతలు:
తెలంగాణాలోని 14,236 అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 10వ తరగతి అర్హత కలిగి ఉండాలి. స్థానికంగా ఉన్న మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. పురుష అభ్యర్థులకు అవకాశం ఉండదు.ఇందులో 6,399 అంగన్వాడీ టీచర్స్, 7836 అంగన్వాడీ హెల్పర్స్ ఉద్యోగాలు ఉన్నాయి.
అంగన్వాడీ టీచర్స్ | 6,399 పోస్టులు |
అంగన్వాడీ హెల్పర్స్ | 8,837 పోస్టులు |
కోర్టుల్లో భారీగా Jr.అసిస్టెంట్ జాబ్స్ : Apply
ఎంపిక ఎలా చేస్తారు:
సాధారణంగా అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న మహిళా అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 10th లో వచ్చిన Merit మార్కులు ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి సొంత గ్రామంలోని అంగన్వాడీలలో పోస్టింగ్ ఇస్తారు.
అప్లికేషన్ ఫీజు:
అంగన్వాడీ టీచర్, హెల్పర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
పశు సంవర్ధక శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్ : Apply
శాలరీ ఎంత ఉంటుంది:
అంగన్వాడీ టీచర్, హెల్పర్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹15,000/- జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసి అప్లికేషన్ ఫారం
10th అర్హత సర్టిఫికెట్స్, Age ప్రూఫ్ సర్టిఫికెట్స్
కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్, రెసిడెన్సీ సర్టిఫికెట్స్ ఉండాలి
ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగాలు : Apply
తెలంగాణా అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. త్వరలో నోటిఫికేషన్స్ విడుదల చేస్తారు.
Anganwadi Jobs Official Update PDF
అంగన్వాడీ ఉద్యోగాలకు తెలంగాణాలోని స్థానికంగా ఉన్న మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.