Telangana Outsourcing Jobs 2025:
తెలంగాణా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుండి 03 డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
తెలంగాణా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు 17th ఫిబ్రవరి తేదీలోగా ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోగలరు. పూర్తి చేసిన అప్లికేషన్స్ ని DM&HO, F1,IDOC, అంతయిపల్లి, మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా అడ్రస్ కి పంపించవలెను.
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
తెలంగాణా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుండి 03 డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు.
DRDO లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు : Apply
సెలక్షన్ ప్రాసెస్:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులఎంజే ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కులు, అర్హతల ఆధారంగా ఎంపిక చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా పోస్టింగ్ ఇస్తారు.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
సికింద్రాబాద్ రైల్వే IRCTC లో ఉద్యోగాలు : Apply
అప్లికేషన్ ఫీజు:
ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹500/- డిమాండ్ డ్రాఫ్ట్ తీసి అప్లికేషన్ తో పాటు పంపించవలెను. జిల్లా మెడికల్ & హెల్త్ ఆఫీసర్, మేడ్చల్ – మల్కాజ్గిరి పేరు మీద DD తియ్యాలి.
శాలరీ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹24,500/- జీతం చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సులు కూడా ఉంటాయి.
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్
కంప్యూటర్ నౌలెడ్జి సర్టిఫికెట్స్ ఉండాలి
1st నుండి 7th వరకు స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
తిరుపతిలో అన్ని జిల్లాలవారికి ఉద్యోగాలు : ఇంటర్ అర్హత
ఎలా Apply చెయ్యాలి:
తెలంగాణా అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోని దరఖాస్తు చేసుకోగలరు.
తెలంగాణా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.