AP Panchayat Raj Notification 2025:
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖలో ఖాళీగా ఉన్న 1488 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కరోనా సమయంలో మరణించిన కుటుంబాల అభ్యర్థులతో ఈ నియామకాలు కారుణ్య నియామకాల కింద చేయట్టాలని నిర్ణయించడం జరిగింది. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా పంచాయతీ రాజ్ లో పని చేసి కరోనా సమయంలో మరణించిన అధికారుల కుటుంబాల నుండి అర్హులైన, అర్హత కలిగినవారిని తీసుకొని భర్తీ చేస్తారు. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేసే అవకాశం ఉంటుంది.
ఈ రిక్రూట్మెంట్ ఫైల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వద్దకు చేరడం జరిగింది. సీఎం ఆదేశిస్తే వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తారు. పంచాయతి రాజ్ ఉద్యోగుల కుటుంబాలకు ఇది ఊరట కలిగించే అంశం.
ఆంధ్రప్రదేశ్ లో మొదటి, రెండవ వేవ్ కారణంగా రాష్ట్రంలో 2,917 మంది అధికారులు / ఉద్యోగులు మరణించారని ప్రభుత్వ అంచనా. వివిధ డిపార్ట్మెంట్స్ కి సంబందించిన ఉద్యోగులు 1944 మంది, జిల్లా కలెక్టరేట్ల పరిధిలో 330 మంది, యూనివర్సిటీల్లో 83 మంది, కార్పొరేషన్స్, సొసైటీలకు సంబందించిన వారు 560 మంది మరణించారు.
విద్యుత్ ఉత్పత్తి సంస్థలో అసిస్టెంట్ ఉద్యోగాలు : Apply
ఉండవలసిన అర్హతలు:
పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యాలంటే ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. కొన్ని రకాల ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ కూడా ఉండే అవకాశం ఉంటుంది.
AP ECHS డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు విడుదల: 10th అర్హత
ఎంత వయస్సు ఉండాలి:
ఈ కారుణ్య నియామకాలకు దరఖాస్తు చేసుకువాలంటే 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
AP ఫైబర్ నెట్ డిపార్ట్మెంట్ లో కొత్త నోటిఫికేషన్ విడుదల: Apply
నోటిఫికేషన్ విడుదల ఎప్పుడు?
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖలో ఖాళీగా ఉన్న 1488 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. వీటిని కారుణ్య నియమకాల ద్వారా భర్తీ చేసేందుకు అధికారులు ఖాళీలకు సంబందించిన ఫైల్ ని ముఖ్యమంత్రి వద్దకు పంపించడం జరిగింది. ముఖ్యమంత్రి ఆమోదం వచ్చిన వెంటనే రిక్రూట్మెంట్ చేస్తారు.
కారుణ్య నియామకాల ఉద్యోగాలకు అన్ని జిల్లాలలోని ఉద్యోగుల కుటుంబాల అభ్యర్థులకు అవకాశం ఉంటుంది.