Railway Group D Notification 2024:
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ RRC నుండి జోన్లవారి ఖాళీలతో 32,438 గ్రూప్ D నోటిఫికేషన్ విడుదల చేశారు. 10th, ITI అర్హత కలిగి 18 నుండి 33 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, ఫిసికల్ ఈవెంట్స్ నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి సెలక్షన్ ప్రాసెస్ తెలుసుకోగలరు.
మొత్తం ఎన్ని పోస్టులు:
రైల్వే శాఖ అన్ని జోన్లు కలిపి 32,438 పోస్టులతో గ్రూప్ D ఉద్యోగాలకు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు.
పోస్టుల వివరాలు, అర్హతలు:
దేశ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్న రైల్వే గ్రూప్ D నోటిఫికేషన్ 32,438 పోస్టులతో విడుదల చేశారు. ఈ పోస్టులకు 10th తో పాటు ITI చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం 10th అర్హత కలిగినవారికి అవకాశం ఉండదు. పాయింట్స్ మెన్ B, అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
2,500+ పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల: 10+2 అర్హత
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 33 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయో పరిమితి లో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
ఆన్లైన్ లో అప్లికేషన్స్ చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ స్టేజి 1 రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. రాత పరీక్షలో అర్హత పొందిన వారికి ఫిసికల్ ఈవెంట్స్ నిర్వహిస్తారు. రాత పరీక్షలో అప్టిట్యూడ్, రీసనింగ్, జనరల్ సైన్స్, GK నుండి ప్రశ్నలు వస్తాయి.
అసిస్టెంట్ నాన్ టీచింగ్ ఉద్యోగాలు విడుదల: Apply
శాలరీ ఎంత ఉంటుంది:
రైల్వే గ్రూప్ D ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹35,000/- వరకు జీతాలు ఉంటాయి. TA, DA, HRA వంటి అన్ని రకాల అలవెన్సెస్ బెనిఫిట్స్ ఉంటాయి.
కోర్టుల్లో 241 గవర్నమెంట్ Jr అసిస్టెంట్ జాబ్స్
కావాల్సిన సర్టిఫికెట్స్:
నోటిఫికేషన్ విడుదల చేశాక ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి.
10th, ITI మార్క్స్ మెమోలు, NCVT, SCVT సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
క్యాస్ట్ సర్టిఫికెట్స్, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
అప్రెంటీస్ చేసిన అభ్యర్థులు అయితే అప్రెంటీస్ పూర్తి చేసిన సర్టిఫికెట్స్ ఉండాలి.
రైల్వే శాఖ విడుదల చేసిన రైల్వే గ్రూప్ D ఆఫీసియల్ నోటీస్ ని ఈ క్రింది లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
Railway Group D Jobs Full Details
రైల్వే గ్రూప్ D ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
