Apsrtc Notification 2024:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (Apsrtc) నుండి 7,545 ఉద్యోగాల భర్తీకి Apsrtc సిద్ధమైంది. Rtc సంస్థలోని ఖాళీల వివరాలను యాజమాన్యం ప్రభుత్వానికి సమర్పించింది. మొత్తం 18 కేటగిరీల్లో 7,545 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. ఇందులో 3,673 రెగ్యులర్ డ్రైవర్,1,813 కండక్టర్ పోస్టులు, 579 అసిస్టెంట్ మెకానిక్, శ్రామిక్, 207 ట్రాఫిక్ సూపెర్వైసోర్ ట్రైనీలు, 179 మెకానిక్ సూపెర్వైసోర్ ట్రైనీలు, 280 డిప్యూటీ సూపరింటెండెంట్, 656 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు అర్హులు. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వివరాలు తెలుసుకోగలరు.
పోస్టులవారీగా ఖాళీలు, వాటి అర్హతల వివరాలు:
| పోస్టుల పేరు | ఖాళీలు | అర్హతలు |
| రెగ్యులర్ డ్రైవర్ | 3,673 | 10th పాస్ + డ్రైవింగ్ లైసెన్స్ |
| కండక్టర్ పోస్టులు | 1,813 | 10th పాస్ |
| అసిస్టెంట్ మెకానిక్, శ్రామిక్ | 579 | 10th + ITI |
| జూనియర్ అసిస్టెంట్ | 656 | ఏదైనా డిగ్రీ |
| ట్రాఫిక్ సూపెర్వైసోర్ ట్రైనీలు | 207 | ఏదైనా డిగ్రీ |
| మెకానిక్ సూపెర్వైసర్ ట్రైనీలు | 179 | ఏదైనా డిగ్రీ |
| డిప్యూటీ సూపరింటెండెంట్ | 280 | ఏదైనా డిగ్రీ |
| మొత్తం ఖాళీలు | 7,545 |
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
TS నీటి పారుదలశాఖలో 1878 అవుట్ సోర్సింగ్ జాబ్స్: No Exam
ఎంపిక విధానం:
Apsrtc నుండి విడుదలయ్యే 7,545 పోస్టులలో కొన్ని పోస్టులను రెగ్యులర్ విధానంలో నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. మిగిలిన పోస్టులను కారుణ్య నియామకాల ఆధారంగా ఎంపిక చేస్తారు. కొన్ని పోస్టులకు స్కిల్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది.
శాలరీ వివరాలు:
Apsrtc లో డ్రైవర్, కండక్టర్, జూనియర్ అసిస్టెంట్, ఇతర పోస్టులకు ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి నెలకు ₹19,000/- నుండి ₹35,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలు అయినందున అన్ని రకాల ఇతర అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.
ప్రభుత్వ కళాశాలలో 10th అర్హతతో Govt జాబ్స్ : Apply
అప్లికేషన్ ఫీజు ఎంత ఉండొచ్చు:
అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత పోస్టులను అనుసరించి ఉద్యోగాల ప్రకటనలో కేటగిరీల వారీగా అప్లికేషన్ లేదా దరఖాస్తు ఫీజు కేటాయిస్తారు.
నోటిఫికేషన్ విడుదల ఎప్పుడు?:
AP ప్రభుత్వానికి APSRTC యాజమాన్యం అన్ని ఖాళీలకు సంబందించిన ప్రతిపాదనలు పంపించడం జరిగింది. Ap ప్రభుత్వం నుండి అధికారికంగా ఆమోదం వచ్చిన వెంటనే పూర్తి నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది.
గ్రామీణాభివృద్ధి సంస్థలో 10+2 అర్హతతో ఉద్యోగాలు : Apply
ఎలా Apply చేసుకోవాలి:
అధికారిక నోటిఫికేషన్ మరికొద్ది రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఈరోజు వచ్చిన రిక్రూట్మెంట్ వివరాలను ఈ క్రింది pdf లింక్స్ ఆధారంగా డౌన్లోడ్ చేసుకొని చూడగలరు.
Apsrtc Recruitment Details PDF
Apsrtc నుండి విడుదలయ్యే ఈ 7,545 ఉద్యోగాలకు అన్ని జిల్లాలవారు దరఖాస్తు చేసుకోగలరు.
