AP Welfare Dept. Notification 2024:
ఆంధ్రప్రదేశ్ స్త్రీ, శిశు, సంక్షేమ శాఖ నుండి పార్వతిపురం మన్యం జిల్లాలోని వన్ స్టాప్ సెంటర్ లో పని చేయడానికి మిషన్ శక్తి డిపార్ట్మెంట్ నుండి కాంట్రాక్టు పద్దతిలో 10 రకాల ఉద్యోగాలను విడుదల చేసారు. 25 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టుల వివరాలు, అర్హతలు:
సెక్యూరిటీ గార్డ్ /నైట్ గార్డ్ : 10వ తరగతి అర్హత కలిగిన మహిళలు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. 2 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి అవకాశం కల్పిస్తారు.
మల్టీ పర్పస్ స్టాఫ్ : 10వ తరగతి అర్హత కలిగిన మహిళలు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. మహిళలు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
ఆఫీస్ అసిస్టెంట్, కంప్యూటర్ నౌలెడ్జి : ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి డిగ్రీ ఉత్తీర్ణత కలిగి కంప్యూటర్ సర్టిఫికెట్స్ కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. 03 సంవత్సరాల అనుభవం కూడా ఉండాలి.
పారా మెడికల్ పర్సనల్ : పారామెడికల్ విభాగంలో అర్హత కలిగిన వారు apply చేసుకోగలరు. అనుభవం ఉన్న మహిళా అభ్యర్థులు అర్హులు.
మిగిలిన పోస్టులకు, పోస్టులను అనుసరించి డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో అర్హత కలిగి అనుభవం ఉన్న మహిళా అభ్యర్థులు అర్హులు.
ఎయిర్ పోర్టుల్లో సూపర్వైసర్ ఉద్యోగాలు : Apply
వయస్సు వివరాలు:
25 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
సెలక్షన్ ప్రాసెస్:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో అర్హతలు కలిగి మంచి మెరిట్ మార్కులు, అనుభవం కలిగిన అభ్యర్థులను నేరుగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు . ఎటువంటి రాత పరీక్ష లేదు.
దరఖాస్తు చేసుకునే తేదీలు:
నోటిఫికేషన్ విడుదలయిన తేదీనుండి సెప్టెంబర్ 12వ తేదీలోగా సంబందించిన డిపార్ట్మెంట్ లో దరఖాస్తులు సబ్మిట్ చెయ్యాలి. ఆఖరు తేదీ తర్వాత వచ్చిన నోటిఫికేషన్స్ తిరస్కరించడం జరుగుతుంది.
శాలరీ వివరాలు:
పోస్టులను అనుసరించి ₹13,000/- నుండి ₹34,000/- వరకు జీతం ఉంటుంది. కాంట్రాక్టు ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్స్ లు ఏమీ ఉండవు. డిపార్ట్మెంట్ వారి అవసరాన్ని బట్టి సెలెక్ట్ అయిన అభ్యర్థుల కాంట్రాక్టు పీరియడ్ పొడిగించే అవకాశం కూడా ఉంటుంది.
కావలసిన సర్టిఫికెట్స్:
10th క్లాస్డ్ మార్క్స్ లిస్ట్
ఇంటర్ మార్క్స్ లిస్ట్, డిగ్రీ మార్క్స్ మెమో ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు (SC, ST, OBC )
అనుభవం ఉన్న సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
ఎలా దరఖాస్తు చేయాలి:
అధికారిక జిల్లా వెబ్సైటు నందు నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు ఫారం సబ్మిట్ చెయ్యాలి
నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫారం PDF
ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలవారీగా విడుదలయ్యే ఉద్యోగాలకోసం మా వెబ్సైటుని సందర్శించండి.