TS ఇంటర్ రిజల్ట్స్ విడుదల తేదీ ఇదే | TS Inter Results 2024 | TS Inter 1st & 2nd Year Results 2024

Telangana Inter Results 2024:

తెలంగాణాలో ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం రాత పరీక్షలను తెలంగాణా ఇంటర్మీడియట్ బోర్డు విజయవంతంగా ముగించింది. మొత్తం 1st ఇయర్, 2nd ఇయర్ కలిపి 9లక్షల మంది ఇంటర్ పరీక్షలు రాశారు. ఇందులో 1st ఇయర్ వాళ్ళు 4,78,527 మంది ఉన్నారు. అలాగే 4 లక్షల మందికి పైగా 2nd ఇయర్ విద్యార్థులు ఉన్నారు. ఈసారి ఇంటర్మీడియట్ పరీక్షల కోసం మొత్తంగా 9,22,520 మంది పరీక్ష ఫీజు చెల్లించారు.

TS Inter Results 2024 – Official Release Date:

ఈ నెల 22వ తేదీన ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాలువెలువడనున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఒకేసారి వెల్లడిస్తామని అధికారులు తెలి పారు. ఫలితాల వెల్లడిపై ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా తేదీని ప్రక టించనున్నట్టు బోర్డు కమిషనర్ శృతి ఓజా ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. ఆది, లేదా సోమవారం ఫలితాలను వెల్లడించాలనుకుంటున్నామని, ఎక్కువ శా తం సోమవారమే ఉండొచ్చని ఆమె చెప్పారు. ఫలితాలకు సంబంధించి అన్ని దశల్లోనూ పరిశీలన పూర్తయిందని, ఎలాంటి లోటు పాట్లు లేవని భావించిన నేపథ్యంలోనే ఫలితాల వెల్లడికి రంగం సిద్ధం చేస్తున్నామని ఆమె తెలిపారు.

Join Our Telegram Group

ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు దాదాపు 10 లక్షల మంది హాజరయ్యారు. మార్చి 6వ తేదీ నుం చే మూల్యాంకన ప్రక్రియ మొదలు పెట్టారు. దాదాపు 60 లక్షల సమాధాన పత్రాల మూల్యాంకనను మార్చి నెలాఖరుతో పూర్తి చేశారు. ఈ నెల మొదటి వారంలో ఓఎంఆర్ షీట్ల డీ కోడింగ్ చేశారు. మార్కులు ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత అన్ని విధాలా పరిశీలన చేశారు. ఎలాంటి సమస్యలు లేకపో వడంతో అధికారికంగా విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారు.

ఈ నెల 22న ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. పరీక్షలకు దాదాపు 10 లక్షల మంది హాజరయ్యారు. ఫలితాల విడుదలకు అధికారులు రంగం సిద్ధం చేశారు.

రైల్వే గ్రూప్ D Govt జాబ్స్ విడుదల: 10th Pass

TCS లో Backlogs, స్టడీ గ్యాప్ ఉన్నా జాబ్స్

CBI బ్యాంక్ లో తెలుగు వచ్చినవారికి జాబ్స్

Paytm లో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్

How To Check TS Inter Results 2024:

విద్యార్థులు వారి TS ఇంటర్ ఫలితాలు 2024 మొదటి సంవత్సరం మరియు TS ఇంటర్ రెండవ సంవత్సరం ఫలితాలు 2024 కు సంబందించిన ఫలితాల ప్రకటన తర్వాత Check చేయడానికి క్రింది వెబ్‌సైట్‌లను సందర్శించవచ్చు:

tsbie.cgg.gov.in

results.cgg.gov.in

TS Inter Results 2024 Update PDF

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!